అక్షర పిపాసి

అక్షర పిపాసి_harshanews.com
అక్షర పిపాసి 

ఆయన అక్షర పిపాసి
ఆయన ఓ సారధి

విశ్వంభర సృష్టికర్త
కామం,క్రోధం,లోభం,మదం 
అన్ని రకాల గుణాల సమ్మేళనం  అంటూ 
మనిషి అంటే ఒకరు కాదే 
అనేకానేకులు ఓ గాంధీ, ఓ అలెగ్జాండర్ 
ఎన్నెన్ని రూపాలు అంటూ 

మనిషి సాధన త్రిముఖం 
కళాత్మకం,వైజ్ఞానికం,ఆధ్యాత్మీకం 
ఎక్కడ లేవు ఎత్తుపల్లాలు
ఎదురుదెబ్బలు
ఇదేగా జీవితం అని
వర్ణించే"సినారే"

ఆయన కనిపించే విద్యాలయమే 
అనేకానేక రచనా గ్రంధాల సారమే 
ఎంత నిర్వచించిన 
అనిర్వచనీయమే ఆయన ఘనత 
ఆయనే 
అక్షర రాసుల"సినారే"

..................................................................

అక్షర పిపాసి_harshanews.com

శ్రీలత సవిడిబోయిన (శ్రీ)
సీతానగరం, పర్ణశాల 
8107359735 

Post a Comment

0 Comments