కరోనా..

కరోనా..
Image by fernando zhiminaicela from Pixabay 


కరోనా!
ఊపిరి గదిలో చేరి
ఉక్కిరిబిక్కిరి చేస్తూ
ఉన్నపళంగా ఉసురు తీస్తోంది!

మరణశయ్యపై
రక్తసంబంధాలను చూసి
గుండె గుడిలో
కొలువైన మానవత్వం కూడా
మౌన పోరాటం చేస్తోంది !!

కనిపించకుండా వచ్చావు,
వినిపించని మృత్యు గంటలు
మోగిస్తున్నావు
తీరదా నీదాహం
తీరం దాటి వెళ్ళిపోవా!!

కరోనా!!
లోకమంతా ఇప్పుడు 
సమానత్వమే కనిపిస్తోంది
రంగు రూపు భేదం లేదు
ధనిక బీద తేడా లేదు
నీ ముందు అందరూ సమానమే..
......................................................................................


కరోనా..

అంబటి భాను ప్రకాశ్.
99489 48787

Post a Comment

0 Comments