చెలిమి వనం


చెలిమి వనం_harshanews.com
చెలిమి వనం 

ఇరవైమూడు ఏళ్ల శిశిరాన్ని విదిల్చుకుని
వాసంతాన్ని వరించెనా..!
మూడుమాసాల కాలపుపొత్తిళ్లలో
ఆశలరెక్కలు మొలిపించుకొని
ఆనందపుటంచులనే తాకెనా...!!

ఆత్మీయతలను కలబోసిన 
అనురాగ కువకువల పిట్టలు కొన్ని..
అల్లరిపవనాలను వీచే 
నిష్కల్మష తరువులు 
కొమ్మలపై చిత్రంగా వాలెనా...!

తీపిరాగాలను రువ్వే 
ఎలకోయిలలు కొన్ని..
రతనాల మాటలమాటల 
మొలకలు కొన్ని
బంధమై పెనవేసుకొనెనా...!

అమాయకత్వపు 
పరిమళాలను జిమ్మే విరులకొన్ని...
ఉరుమై గర్జించే
శ్రేయపుమమతల జీవులు కొన్ని..
సహజీవనం సాగించెనా..!

అనుక్షణం నవ్విస్తూ 
హాయినిపంచే ఆప్తగిరులు కొన్ని..
బాధలకు ఓదార్పు 
లేపనాలుపూసే ఔషధమూలికలు కొన్ని..
స్నేహమై వెలిగెనా..!

చిగురించిన ఛైత్రానికి ప్రతీకలై
ఆగమించిన ఆమనికి సాక్ష్యాలై
విలసిల్లిన చెలిమివనమే 
మా డైటు బృందావనమై వాట్సప్ వేదికపై సాగెనా...!
స్నేహపు మాధుర్యాన్ని రుచిచూపించెనా!!

చెలిమి వనం_harshanews.com
1996-97 డైట్ వికారాబాద్ మిత్రులకు అంకితం


 ..................................................................
అయిత అనిత
89853 48424

Post a Comment

0 Comments