యదార్థవాది...లోక విరోధి

యదార్థవాది...లోక విరోధి_harshanews.com
యదార్థవాది...లోక విరోధి 


ఈ రోజుల్లో నటించేవాళ్ళు 
నలుగురిలో బాగానే వుంటారు.
యదార్ధంగా మాట్లాడేవారే 
ఒంటరిగా ఉంటారు.

    జీవితంలో నటించటం అనర్ధం కదా!!
    జీవితంలో జయించటమే పరమార్ధం మరి!!
    శ్రీరమణీయమైన శ్రీరంగనీతులు చాటరాదు
    చిత్తశుద్ధితో రమణీయమైన 
    చేతలకు చోటు చేయాలి.

నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు
పొగరుగానే వుంటారు..వారికి మరి
నటించటం తెలియదు,ఆత్మగౌరవంతో
జీవిచటం తప్ప.

కరోన కలియుగంలో, అసత్యవాదికి నేడు  ఉన్నతమైన స్థానం వుంది    యదార్థవాదికి నేడు స్థానం లేదు సరి కదా    విలువ కూడా లేదు సుమ!!

    ఆస్తులు,అంతస్తులకు వెల కట్టగలము కాని
    బంధానికి,నిజాయితీకి వెల కట్టగలమా?
    నిస్వార్థపరులు గౌరవానికి ప్రతీకలు..మరి
    స్వార్థపరులు అగౌరవానికి ప్రతీకలే..మరి!!

                జీవితం ఎంతో విలువైన బహుమతి దాని
                విలువ తెలిసినవాడే యదార్ధమైన మనిషి
                బహుమతిని నిజాయితీగా ఆస్వాదించడం
               ఆనందించడం కూడా యదార్థవాదికే సొంతం.
    
    కరోన మహమ్మారి నేడు స్వార్థపరుడి
    మెళుకువలను ప్రోత్సహిస్తోంది ఎందుకో?
   కరుణించు మాతా.. కరుణించు మమ్ములను
   స్వార్థంతో నిస్వార్థతను జయించి మమ్మల్ని
    ఆట పట్టించకు.

               యదార్థవాదుల దారి రాజ మార్గమైతే మరి
               ఉగ్రవాదుల దారి అడ్డ దారి వైపే కదూ!!
               నేడు నక్కజిత్తులదే రాజ మార్గం..
               మృగరాజైన సింహానికి అడ్డ దారే దారి!!

అందమైన జీవితాన్ని కన్నుల పండుగగా.. ఆస్వాదించడం కష్టమని ముద్ర వేసింది కరోన అందంగా,ఆనందంగా,కన్నుల పండుగగా..   జీవిస్తున్నట్టు నటించమని శాసిస్తోంది కరోన. అందుకే యదార్థవాది..విరోథి అన్నారు.

నాట్యమయూరి టి.వి.శిరీష
హైదరాబాద్​
96184 94909

Post a Comment

0 Comments