అక్షర తపస్వి

అక్షర తపస్వి_harshanews.com
అక్షర తపస్వి 


నీ అవతరణం 
తెలుగుభాషకు వరప్రసాదమై 
పౌర్ణమి నాడుపుట్టి 
తెలుగు సాహిత్యంలో  
నిండు చంద్రుడై 
సాహితి వెలుగులు 
నింపిన సినారే

కలం అనే హాలంతో 
అక్షరాలే విత్తుగా 
సాహితి సేద్యంతో 
తెలుగు సాహిత్యపు ఫలాలను 
భావితరాలకు అందించిన అక్షరతపస్వి

కాలంతో కదలి 
సమాజమందలి దోషాల మార్పుకై 
అక్షరవిప్లవం చేసి 
తెలుగు సాహిత్యంలో 
అనేక ప్రక్రియలో రచించి 
అజరామర కీర్తీ పొందిన అభ్యదయకవి 

సిరా ఇంకేవరకు రాసి 
తెలుగు సాహిత్య సుగంధాలను 
దశదిశల వెదజల్లి విశ్వంభరతో
జ్ఞనాపీఠ్ ను ముద్దాడిన సాహితిశిఖరం

ఎంతోమంది 
కవులకు ఆదర్శమై 
వారిలో చైతన్యం తెచ్చి 
సాహితి రాజమార్గాన్ని చూపిన
సరస్వతి పుత్ర

కవిగా ప్రజాప్రతినిధిగా 
విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 
పదవి ఏదైన 
దానికే వన్నేతెచ్చి 
పద్మభూషణ్  పొందిన 
బహుముఖ ప్రజ్ఞాశాలి
సినారే 

కలంతో అమృతాన్ని 
అగ్నిని కురిపించి 
అవనికి సాహిత్యాపరిమాళాలను 
అందించిన సాహితిశిఖరం
సినారేకు ఇదే నా కవితాసుమాంజలి
......................................................

అక్షర తపస్వి_harshanews.com

డి.అమీర్
కొమ్మేమర్రి, కర్నూలు జిల్లా.
96424 80702


Post a Comment

0 Comments