మొక్కే.. దిక్కు

మొక్కే.. దిక్కు _harshanews.com
మొక్కే.. దిక్కు 


ఆకుపచ్చని ఆవరణ కోసం 
పసిడి పచ్చని రాష్ట్రము కోసం 

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు 
తెగనరికితే తప్పదు పరేషాన్ 

ఊరు వాడ పచ్చగుండాలె 
పిల్లా పాప సల్లంగుండాలె 

చెట్టు నరికితే అమాస 
మొక్క నాటితే పునాస 

బతకని చెట్టుని బతుకునిచ్చే కనికట్టుని 
అడిగితే అన్నం పెట్టె కన్నతల్లిని 

అడుగుకోక చెట్టు 
అభివృద్ధికి అదొక మెట్టు 

చక్కగా పెరిగే చెట్లు 
స్వర్గానికి ఎక్కించే మెట్లు 

చెట్లు నాటితే క్షేమం 
నరికితే క్షామం 
 
చెట్టంటేనే తల్లిలేక్క 
చెట్టుంటేనే నోట్లోబుక్క 

వన సంరక్షణ 
మనం సంరక్షణ 

మేఘాలను నిలవేసే ఆకుపచ్చని చిత్రాలు 
వర్షాలను కురిపించే బీజాక్షిక మంత్రాలు 

ఇళ్లన్నింటిలో ఏ ఇల్లు మేలు 
విరివిగా చెట్లున్న ప్రతి ఇల్లు మేలు 

పక్షి గూటికి తనువు నిచ్చే తల్లిరా చెట్టు 
రక్ష నిచ్చే గుణానికి తను  సూచికనైనట్లు 

ఆకలేస్తే తినడానికి ఆహరం పెడుతుంది 
చెట్టు మన ఇంటినే నిలబెడుతుంది

చెట్టంటే పువ్వుల మేడ 
చెట్టే కదా పుడమికి నీడ 

ఎండలు మండుతున్న నీడ నీకు ఇస్తుంది 
జడివానలు తడిపిన, నీకు గోడగై నిలుస్తుంది. 

అధికారికి తల వంచదు,  అనాథలను పొమ్మనదు 
అందరిని ఒకే రకంగా ఆదరణను పంచుతుంది 

బుద్దిగా తీర్చి దిద్ది సాగనంపనట్లు...... 
సద్దుల వలె చెట్లు  నిలుస్తాయి 

మట్టిని చెట్టుకు వచ్చే ప్రాణ శక్తి చెట్టంటే 
గాలికి గమనం నేర్పే గురువే కదా చెట్టంటే 

ప్రకృతి ప్రసాదించు వరమే కదా వృక్షం 
జన జీవన సౌభాగ్యానికి తానే ఒక్క సాక్ష్యం 

మనం ఆరోగ్యముగా ఉండాలంటే ప్రకృతి సల్లంగుండాలె ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. మనం ఆరోగ్యముగా ఉండాలంటే ప్రతి ఒక్కరు నువ్వు నేను మనందరం కలిసి చెట్లు నాటుదాం మన తెలంగాణను హరిత తెలంగాణగా  మార్చుదాం.... జటావత్ మునినాయక్
జాల్ తండా, 
తిరుమలగిరి సాగర్ (మండలం ) 
నల్గొండ (జిల్లా ) 
76598 88655

Post a Comment

0 Comments