పుస్తకం

పుస్తకం _harshanews.com
పుస్తకం 

        
పుస్తకం ఆట వస్తువు కాదు
మెదడుకు పదును పెట్టే
పరమౌషధం!
కల్లోలభరితమైన మనస్సుకు
ప్రశాంతతను చేకూర్చే మంత్రదండం!

శోకతప్త హృదయాలను శాంత పరిచే
దుఃఖోపశమనం!
అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే
దివ్యజ్యోతి!

దూరదేశాల్లో ఒంటరితనాన్ని పోగొట్టే
ఆత్మీయ బంధువు!
మంచీచెడుల విచక్షణను తెలిపే
ఆత్మీయ నేస్తం!

పుస్తకం ఒక విజ్ఞాన ఖని
పుస్తకం ఒక మార్గదర్శి

పుస్తకం ఒక వ్యక్తిత్వ వికాస సూచీ!  
పుస్తకం కారాదు నెత్తికింది దిండు!
కావాలి నెత్తిలోని మెదడును
చైతన్య పరిచే కిరణం!

మంచిని పెంచే సాధనం
పుస్తకపఠనం!
మనిషి జీవితంలో విజ్ఞాన వెలుగులు
నింపేది పుస్తక పఠనం!
మానసికవికాసం
పుస్తకపఠన ఫలితం!
పరిపూర్ణ జీవితానికి పునాది
పుస్తక పఠనం!
...............................................................

డా. వెలుదండ వేంకటేశ్వరరావు
మహబూబ్ నగర్.
87904 21061

Post a Comment

0 Comments