సిరిమంజరిలో ‘సామాజిక జీవన చిత్రణ’


 
సిరిమంజరిలో ‘సామాజిక జీవన చిత్రణ’_harshanews.com
సిరిమంజరిలో ‘సామాజిక జీవన చిత్రణ’
 

తెలుగు సాహిత్యం అనేక రకాల ప్రక్రియలకు నెలవై కొలువై సాగుతూవున్నది.అనేక ప్రక్రియలతో పున్నమి చంద్రుడు లా వెలుగు వెదజల్లుతూ వసంత ఆమని వలే శోభితమై తెలుగు భాష ప్రకాశిస్తూ ఉన్నది.నన్నయ్య గారితో అనువాద ప్రక్రియ మొదలై రచన చేసే మార్గానికి రాజబాట వేశారు.మన ప్రాచీన కాలములో శతకo పురాణo ప్రభంధo యక్షగానము సంకీర్తనలు వచన కవిత్వం వెలుగు వెదజల్లినవి.

నేటి ఆధునిక యుగములో ఛందస్సు పరంపర శైలిలో కవిత్వం ఎన్నో ప్రక్రియలు వరిస్తుంది. ప్రస్తుతము అనేక వచన కవిత్వపు ప్రక్రియలులో యతి ప్రాసను దృష్టిలో ఉంచుకోని ఎన్నో ప్రక్రియలు సాగుతూ వున్నాయి. ఛందస్సును  సంక్లిష్టపు భావము నుండి చాలా సులభంగా  ఆధునీకరణ చేయబడినది  పండితులే కాదు అందరూ కవిత్వం రాయగలరు అనెడి దృక్పథంలోకి నూతనముగా ప్రక్రియల సృష్ఠి జరుగుతూ ఉన్నది.ఇప్పటి నూతన సాహిత్య ప్రక్రియల్లో నూతనముగా వినూత్నముగా  చాలా సులభతరo రూపొందించ బడిన ప్రక్రియ
సిరిమంజరి ఇప్పటికి 100 శత కాలు కవులు లిఖించడము జరిగింది..సామాజిక విషయాలను పురాణాలను ఇతిహాసాలను సాంస్కృతిక ప్రతిబిoచే విధముగా మనసుకు హత్తుకునే విధముగా సూటిగా సంక్షిప్తముగా సామాన్య జనాలకు అర్థం అయ్యేలా తెలియజేయడం సిరిమంజరి
ప్రక్రియ లక్షణము. 

సిరిమంజరిలో ‘సామాజిక జీవన చిత్రణ’_harshanews.com
ప్రశంసా పత్రం


కవితలో భావము సూటిగా పాఠకులను చేరి సంపూర్ణ మానసిక ఆనందము కలుగ జేస్తుంది. 10 పాదాలను కలిగి .5 పాదములో కవి కలము పేరును 10 పాదములో గురువును స్తుతి చేస్తూ ఉన్నట్టుగా ఉంటూ కవితలో మొదటి పదముకు చివరి పదమును ప్రాస పదము వచ్చేలా రాయడము ప్రతి పాదములో 2 సూర్య 1 ఇంద్ర గణము వచ్చేలా రాయడము సిరిమంజరి ప్రత్యేకత. తెలుగు సాహిత్యము తెలియజేసే ఏ సందర్భమును  అయినా  చక్కగా వర్ణించవచ్చును.

మధ్యపానము..సిరిమంజరిలో..
మందు తోడ మనిషి
మరొక జగముకుపోవు
ఆలి బిడ్డ లందరిని
కొట్టి తిట్టి చంపెరు
సిరుల నిచ్చు మాటలు
మత్తు అన్న  భూతము
వల్ల  యెన్ని ఇండ్లుర
నాశ నమవు తున్నాయి
తాగి నోళ్ళ గతింతె
గురువు నేర్పు మర్యాద

సిరిమాంజరిలో పాట గురించి..
కమ్మనైన పాటలు
యెదను తాకు పాటలు 
తెలుపు కవుల భావాలు
నవరసాల మిళితము 
రమ్యమైన పాటలు
దృశ్య మాళికల్లుగా
మధుర కథలు చెప్పును
జోల పాడు పాటలు
మధురగాన పాటలు
గురువు కథలు కమ్మన!!

బాలకార్మికులు సిరిమంజరి ప్రక్రియలో..
ముద్దు చిట్టి చేతులు
చేయరాదు పనులను
పాఠశాల యందున
నేర్వ వలయు చదువును
సిరులు పెంచు శ్రద్ధను
కూలిపనులు వారిని 
చేయమనుట నేరము
బాలకార్మికులు లేని
జాతి మనకు రావాలి
గురువు నింద వద్దురా!
    
ధ్యానము సిరిమంజరి ప్రక్రియలో..
ధ్యాన యోగ చేయుము
అదే నీకు‌ మంచిది
నడకనుకొన సాగించు
ప్రతి రోజు చేయుము
సిరులు కూర్చు మాటరా
జీవ హింస వద్దురా
ప్రేమ తోడ మెలుగుమ
తోడు గాను ఉండుము
నీడ వలెను ఉండుము
గురువు నేర్పు ధ్యానము

సిరిమంజరిలో కరోనా
తరిమి కొట్ట వేలను
ఈకరోన జబ్బును
ప్రాణ భయముతోడను
ప్రజలు అల్లలాడుచు
తిరుగ ఉషకు బాధాయె
కృష్ణ నీవు దయచూపు
చక్రమునుపయోగించి
సంహరించరాదయ్య
ఏలమమ్ము చూడవు
గురువు నిత్య ఆద్యము

సిరిమంజరి లో రైతు బతుకు చిత్రణ
పుడమి పైన జల్లులు
కురిసె పల్లెలందును
చినుకు చినుకు పడగాను
ఒర్రెలెన్నొ నిండెను
వాస్తవంబు సిరిరాగ
బీళ్ళుపడిన భూములు
మొలచె గడ్డి నెంతయో
చెట్లుచిగురు వేసేను
గుబురు లెక్కువయ్యెను
రైతు గురువు పుడమిలో

శ్రమ విజయ బాట సిరిమంజరి ప్రక్రియలో..
ఫలము కొరకు శ్రమములు
ధనము కొరకు యతనము
కీర్తి కొరకు యతనము
సలిపి చూడ విజయము
తెలుగుతేజ పలుకులు
దారి చూపు రేఖలు
ఫలము ధనము పొందుట
కీర్తి వలన సులభము
తెలిసి యరుగు నరవరా
గురువు చెంత ఫలమురా

రెండు రోజుల సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యులు  పాల్గొన్నారు. 200 మంది సదస్సులో పాల్గొన్నారు. డా.బూసి వెంకటస్వామి గారు సదస్సు నిర్వాహకులుగా వ్యవహరించారు.


ధనాశి ఉషారాణి
భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు
భాకరాపేట, చిత్తూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్​
91210 96397

Post a Comment

0 Comments