ది విజనిరి ఆఫ్ ఇండియా

  
ది విజనిరి ఆఫ్ ఇండియా_harshanews.com
ది విజనిరి ఆఫ్ ఇండియా 


భారతదేశ కలల సాకారానికి
రూపం నీవై జనియించావు
మారుమూల పల్లెసీమలోపుట్టి
మహోన్నతుడవై నిలిచావు

పేదరికమెంత కృంగదీసినా
నీకున్న జిజ్ఞాసముందు తలవంచి
విజయంవైపు నడిపించింది
నీ కలలే దేశమై నిలిచాయి

కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం
గురువు చెప్పిన మాటలన్ని
నీ గుండెనింపుకుని
గురువులకే గురువైనావు

లక్ష్యమనే కక్ష్యలో అలుపెరగక
పరుగులుతీసిన జ్ఞనపిపాసి
భారతదేనికే ప్రేరణాయ్యావు
విశ్వవీధిలో దేశాన్ని శక్తిగా నిలిపావు

దేశయువతను కలలు కనమన్నావు
వాటిసాకారానికై సాగమన్నావు
నీ మాటలు నడిచే బాటలు
ఓ భారతరత్నమా అందుకో 
మా అందరి అత్మీయ నివాళి..
.............................................................................

ది విజనిరి ఆఫ్ ఇండియా_harshanews.com

సి.శేఖర్ (సియస్సార్),
తెలుగు భాషోపాద్యాయులు,
పాలమూరు,
90104 80557. 


Post a Comment

0 Comments