రోజుకొకటి


రోజుకొకటి_harshanews.com
రోజుకొకటి 


ఏమున్నది బతుకుల
రోజుకింత ఏదోటి నేర్సుకునుడేగా
పాఠాలు, గుణపాఠాలు తెల్సేది
అపుడేగా కాసింత అనుభవాన్ని
ఎనుకేసుకుని
ముందోళ్కకందించేందుకు

దారెంట నడుస్తుంటేనే
కొతదార్లు కనిపెట్టేది

ఆ దార్లంట
ముండ్లుచ్చొ
గుండ్లుడొచ్చు
పూలుండొచ్చు
పులులుండొచ్చు
ఏందేదురైనా
నడుసుడైతే ఆపొద్దు
ఎల్తనే వుండాలే

నేర్సాలనే ఆశుంటే
నేర్సిందప్పుడప్పుడు
నెమరేసుకోవాలే
అదంతా మతిలున్నదో లేదో
నడుస్తుండాలి
మనెన్కొచ్చొటోళ్ళకు
నల్గురికి దారి సూపుతుండాలి
.........................................................................................................


రోజుకొకటి_harshanews.com

సి. శేఖర్ (సియస్సార్),
సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు,
పాలమూరు,
90104 80557

 

Post a Comment

0 Comments