గురువు మొగ్గలు

గురువు మొగ్గలు_harshanews.com
గురువు మొగ్గలు 


సనాతనకాలం నుంచి ఆధునికం వరకు
నిరంతరం సమాజానికి దారిచూపే దైవం
విశ్వమంతా నమ్మే విజ్ఞాని గురువు

గురువుల మాటలు వేదవాక్కులని
ప్రతి విద్యార్థి ముందుకు సాగిపోవాలి
మన లక్ష్యసాధనకు పునాది గురువు

మనలో దాగున్న అంతఃకరణాలను                   
వెలికితీసే వెలుగుదివ్వే అతడు
తరాల తలరాతలు మార్చేవాడు గురువు

వినయాన్ని నేర్పి బతుకులను మార్చి
విజయాల దారిని చూపే మార్గదర్శి
ముందుకు నడిపించే కొత్తశక్తి గురువు

జ్ఞానాన్ని ఆయుధంగా ధరించి
అజ్ఞానతిమిరాన్ని తరిమేవాడు 
నమస్కారానికి అర్హుడు గురువు

భావిభారతానికి ఆదర్శమూర్తియై
ముందుకు నడుపు రథచక్రం
దేశభక్తిని దేహశక్తిని పెంచేవాడు గురువు
..................................................................................................


సి. శేఖర్ (సియస్సార్)
సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు,
పాలమూరు.
90104 80557.

Post a Comment

0 Comments