మొగ్గలు / ప్రేమ కవిత్వం


మొగ్గలు / ప్రేమ కవిత్వం
Image by Photo Mix from Pixabay 


ప్రియా నీ ఎడబాటు మోయలేక ఎదగాయమై 
కాలాన్ని  వెచ్చని‌ కన్నీళ్ళతో కడుగుతున్నాను
చెలి నీవులేక నాకు కన్నీళ్లే తోడైనాయి 

విషాదగీతికల ప్రవాహ ప్రయాణంతో
ఎన్నోసార్లు మదిమైదానం పచ్చి ముద్దైంది 
ప్రేమగాయం గేయమై మదిని ముంచెత్తింది 

కనురెప్పల మీద కలలసాగు చేస్తుంటే 
కండ్లనుండి దుంకి స్వప్నాలను తెంపుతావు 
కలల వనమంత కన్నీళ్లలో మునిగింది 

ప్రియా కొన్ని అక్షరాలు నీ మెడలో వేస్తే 
ఎన్నిఏండ్లైనా  ఎదనుదాటని వాడని దండైంది
ప్రేమపువ్వు చావుతోనే వాడిపోవును

ఆమె ఎన్నిఏండ్లకు నా కండ్లవడిందో 
నా నయనాలు నిలువురాలై నిలిచెను
ఎడబాటు తెరదీసి ఎదముందు నిలిచింది 
.....................................................................................................

మొగ్గలు / ప్రేమ కవిత్వం

 బోల యాదయ్య
మహబూబ్ నగర్ జిల్లా 
    99122 06427 

       

Post a Comment

0 Comments