నాన్న మొగ్గలు

నాన్న మొగ్గలు_harshanews.com
నాన్న మొగ్గలు 

దేవతలా అమ్మ 
అందరిచేత ప్రశంసలందుకుంటే
కనిపించని దేవుడిలా 
నాన్న గుండెగుడిలో ఉంటడు
పిల్లల హృదయాల్లో 
కొలువైన దేవతలు అమ్మానాన్నలు

మానసిక ఉద్వేగాలెన్నింటినో 
మనసులోనే దాచుకుంటూ
నిశ్శబ్దపుమౌనిలా మౌనరాగమై 
శోకసంద్రమవుతుంటడు
కనిపించని చీకటిగాయాల 
ఒంటరి దుఃఖతనం నాన్న

కుటుంబ జీవనం కోసం 
అనేక త్యాగాలు చేస్తూనే
మన భవిష్యత్తుకై 
బంగారు బాటలు వేస్తుంటడు
తానుఒంటరైనా 
అందరి బాగుకోరేది నాన్న మాత్రమే

వసంతంలా జీవితంలో 
ప్రేమవర్షం కురిపించే నాన్నిపుడు 
పంచభూతాల్లో కలిసిపోయిండు
జ్ఞాపకంగా మిగిలిపోయిన 
నాన్న ఒక స్మృతిశకలం

కుర్చీలో కూర్చొని 
పత్రికను చదువుతున్నప్పుడల్లా
ఒక కొత్త ప్రపంచాన్నేదో 
దర్శించినట్లు ఉండేది
నాన్నలేక దిగాలుగా 
మూలకువడ్డ ఆరాంకుర్చీ
.............................................................................................
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
   90328 44017

Post a Comment

0 Comments