వెర్రితనంతో వినాశనం

వెర్రితనంతో వినాశనం_harshanews.com
వెర్రితనంతో వినాశనం 
తలంపుల వలలో పడ్డాను
కీడో, మేలో యోచించినంత 
వినాశకాలే విపరీత బుద్దిగా 
పరుగులెడుతున్నా 
నా నాశనానికై

చెట్టా,జీవా ఆలోచనే చెదిరిపోయే 
నా స్వార్దపు చింతనలో

మదిలో మెదిలేలోపే 
తలంపు కళ్ళ ముందు  చూపే ప్రతిభ నాది 

పచ్చనిది అని
మేలు చేసింది అనే కృతజ్ఞత కరువై
అమ్మ లాంటి తరువు
త్యాగం మాత్రమే ఎరుక 
అయినా
బ్రతికుండగానే నరికేస్తున్నా 
దాని నిస్వార్థం యాదికేక్కడ

కరుడు గట్టిన నరరూప రాక్షసత్వాన్ని వెంటపెట్టుకుని
మోడును,తలలేని మొండెమును తిలకింపజేస్తు 
రాజుగా/రాణిగా వైపరిత్య రాజ్యాన్నేలుతున్నా...

...............................................................................వెర్రితనంతో వినాశనం_harshanews.com

శ్రీలత  సవిడిబోయిన (శ్రీ)
81073 59735Post a Comment

0 Comments