'వాడి'పోని కవిత్వం

'వాడి'పోని కవిత్వం_harshanews.com
'వాడి'పోని కవిత్వం 


ఆయనో
నిరంతరకవి
ప్రాచీన, నవీన కవులకాయన
వారథైనిలిచాడు
కవిత్వమే ఊపిరిగా
చైతన్యమే ప్రేరణగా
ఇతివృత్తం మానవత్వమై
పరిమళించిన సి.నా.రె

ఆయనడుగేసిన
ప్రక్రియేదైనా
ఆణిముత్యమై మెరిసింది

సాహిత్య వనంలో విరబూసి
విశ్వమంతా కవితా పరిమళాల్ని వెదజల్లాడు

సినారే కవిత్వం
అంశమేదైన దూసుకుపోయే
రెండంచుల ఖడ్గం
తెలుగుతల్లికి రక్షణగోడై నిలిచి
నిరంతర సైనికుడిలా
సాహిత్యోద్యమంలో నిలిచిన మేటి సినారే

ఆయనడుగేయని ప్రక్రియేది
ఆయనో బహుముఖప్రజ్ఞాశాలి

కవిత రాయనిరోజయనకు
కలత నిద్రే
కలంలోంచి జాలువారిన
కవితా కాంతులెన్నో
అందుకే ఆయనందరివాడు
చేపట్టిన పదవులకే
పేరుతెచ్చిన ఆచరణీయుడు

కుర్రాళ్ళకు 
ఆయనో ఉడుకురక్తం
కొత్తకు ప్రేరణనివ్వడం ఆయనకే సొంతం

అంత్యప్రాసలాయనకు
వెలుగైనిలిచాయి
ఎంతటి కఠినభావాలైనా
ఆ రచనలో
చిన్నదై ఒదిగిపోవాల్సిందే
నేర్పుగలకవి సినారే

సామాన్యుల బతుకులను
తన కలంతో ఎత్తపట్టి
గళం వినిపించాడు

సూర్యడు బద్దకస్తుడంటూ
ఆయనలో నిరంతర జిజ్ఞాసను ప్రకటించాడు

ప్రపంచపదులల్లో
సమాజాన్నద్దంలో చూయించిన ఘనుడు

జీవితసత్యాలనన్నీ
గజల్ లో ప్రతిధ్వనించాడు
మనిషిలో దాగిన శక్తికి
ప్రేరణనిచ్చిన సినారే

సాహితజగత్తులో
జ్ఞానపీఠమై ఎదిగాడు
పద్మభూషణుడుగా
కీర్తి పొందిన సినారే
పొందిన సత్కారాలెన్నో
ఆయన చూపిన సాంప్రదాయం 'వాడి'పోనిదై
సాహితిజగాన చిగురులేస్తుంటది
......................................................................'వాడి'పోని కవిత్వం_harshanews.com

సి. శేఖర్ (సియస్సార్),
తెలుగు భాషోపాద్యాయులు,
పాలమూరు,
9010480557. 


Post a Comment

0 Comments