త్రినయని‌–విశాల్, రాహుల్​– సరసుల పెళ్లి

  • 14 నుంచి 17 నుంచి అబ్బురపరిచే ఘట్టాలు
  • ప్రేక్షకులకు కోసం ‘జీ తెలుగు’ ప్రత్యేక కార్యక్రమాలు

త్రినయని‌–విశాల్, రాహుల్​– సరసుల పెళ్లి_harshanews.com
త్రినయని‌–విశాల్ 

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే సమయం రానే వచ్చింది..  ప్రేక్షకుల కోసం  ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించి వినోదాన్ని అందించడంలో ‘జీ తెలుగు’ సఫలీకృతమైతోంది.  జీ తెలుగులో వచ్చే సీరియల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయని అనడంలో  ఏ మాత్రం సందేహం లేదు.. 


తెలుగు రాష్ట్రాల్లో నాన్‌స్టాప్‌ వినోదానికి కేరాఫ్‌ అడ్రస్ జీ తెలుగు. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, ఆకట్టుకునే సీరియల్స్‌, అదిరిపోయే సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ ఎంటర్టైన్మెంట్ వైపే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో జీ తెలుగు తనని తాను ప్రతీరోజు ప్రజలకి అనుగుణంగా మార్చుకుంటూ, జనం యొక్క నాడిని పసిగట్టి వారిని అలరించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తోంది.

జీ తెలుగులో చాలా సీరియల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా అతి తక్కువ కాలంలో అందరి మనసును గెలుచుకున్న సీరియల్స్ నెంబర్.1 కోడలు, త్రినయని. ఈ సీరి యల్స్ లోని ప్రతీ పాత్ర అందరికి సుపరిచితమే. ఆకట్టుకునే కథనాలతో పాటు, అదిరిపోయే ట్విస్ట్‌లతో అలరిస్తున్న ఈ సీరియల్స్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఎదురు చూస్తుంటారు. ఇక ఈ సీరియల్స్ లో నటిస్తున్న రాహుల్ - సరసు, విశాల్ – నయని ఎప్పుడు కలుస్తారా? అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పుడా సమయం వచ్చేసింది. ఈ వారంలో, 14 నుంచి 17 జులై వరకు ఆసక్తికరంగా అబ్బురపరిచే ఘట్టాలనడుమ ఆ నలుగురి వివాహ మహోత్సవానికి బాజా భజంత్రీలు మోగబోతున్నాయి. నెంబర్ 1. కోడలు విషయానికి వస్తే ఊరి జనం అంతా కలిసి పెద్దయ్యను ఒప్పించి రాహుల్ కి ఇష్టం లేకపోయినా సరసు మేడలో తాళికటిస్తారు. అలాగే త్రినయని సీరియల్ లో విశాల్ తన తండ్రి జగదీశ్ వర్మ కోసం నయనిని పెళ్లి చేసుకుంటాడు తప్ప భార్యగా మాత్రం ఒప్పుకోడు.

త్రినయని‌–విశాల్, రాహుల్​– సరసుల పెళ్లి_harshanews.com
 రాహుల్​– సరసు

లాక్‌డౌన్‌ పర్మిషన్స్‌లో భాగంగా పరిమిత సిబ్బందితో, కోవిడ్‌-19 రూల్స్‌ పాటిస్తూ ఈ పెళ్లి ఎపిసోడ్స్ షూటింగ్ చేసారు. అంతేకాకుండా బ్రేక్ సమయంలో మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, చిన్నిపాటి విషయాలు కూడా గమనిస్తూ, నిత్యం సీరియల్ సెట్స్ ని శానిటైజ్ చేస్తూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాహుల్- సరసు మరియు విశాల్- నయని పెళ్లి ఎపిసోడ్స్ షూట్ చేసారు. అద్యంతం ఆకట్టుకునే మలుపులు, అదిరిపోయే కథనంతో సాగిపోతున్న నెంబర్.1 కోడలు మరియు త్రినయని సీరియల్స్ లో రాబోయే ఎపిసోడ్స్‌ ప్రేక్షకులను కనువిందుకానున్నాయి.. 

Post a Comment

0 Comments