ఆటల యోధుడు– అక్షర ప్రజ్ఞుడు ‘వెన్నెల వనం’

ఆటల యోధుడు– అక్షర ప్రజ్ఞుడు ‘వెన్నెల వనం’_harshanews.com
ఆటల యోధుడు– అక్షర ప్రజ్ఞుడు ‘వెన్నెల వనం’ 

ఆటల యోధుడు– అక్షర ప్రజ్ఞుడు
వెరసి.. పీఈటీ సారూ.. వెన్నెలవనం
తాను విజిల్​ వేస్తే.. గ్రౌండ్​ సిట్ రైట్​ అవుతది.. గళమెత్తితే చాలు.. సమావేశ ప్రాంగణం ముగ్ధమోహనమవుతది.

ఆడపిల్లలు చదువుకోవడమే కష్టంగా ఉన్న కాలంలోనే.. మారుమూల గ్రామాల నుండి ఆడపిల్లల్ని జాతీయ స్థాయి పోటీల వరకు తీసుకెళ్లి ఎన్నో విజయాలను సాధించేలా చేసిన పీఈటీ.. ఇక మగ పిల్లలైతే.. అన్నింటా వారే.. స్వయంగా మంచి ఆటగాడైన నాటి నవయువకుడు డిగ్రీతో పాటు పీఈటీ ట్రైనింగ్​తో.. పీఈటీగా ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. ఆటల యోధుడై తాను పనిచేసిన పాఠశాల విద్యార్థులకే కాదు, ఆ గ్రామంలో, జిల్లాలో, రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఆటకు ట్రైనింగ్​ ఇస్తూ.. మార్చ్​ఫాస్ట్​, లేజిమ్స్​, డంబెల్స్ లతో పెరెడ్​ చేయిస్తూ.. పీఈటీ సార్​గా తన పేరును స్థిరం చేసుకోవడం.. నిజంగా నిజమైన అక్షరనిజం.

అంతేకాదు ‘తెలంగాణా తొలిదశ ఉద్యమంలో’ ముందుండి నాటి తెలంగాణ ఉద్యమంలో పోలీసుల దెబ్బలు తిని, జైలుపాలైన సామాజిక ఉద్యమకారుడు, సమస్య ఉన్న చోట తానే  సమాధానమై నిలిచి ఎన్నో పోరాటాలు చేసిన సంస్కర్త.

ఇక ఆటల యోధుడై, ఉద్యమకారుడై, సామాజిక కార్యకర్తగా నిల్చిన తాను అక్షర ప్రజ్ఞుడు కూడా. వెన్నెల వనంగా సాహితీవనాన్ని పరిపుష్టం చేసిన కవివర్యులు.

సాంస్కృతిక సాహితీ సమాఖ్య, దేవరకొండ, కార్యదర్శి.. సమాఖ్యనే తానై ఇంచుమించు 40 సంవత్సరాలుగా ఎన్నో పుస్తకాలను ఆవిష్కరించి, నల్లగొండ జిల్లాలోనే గాదు రాష్ట్రంలోనే ఎన్నో అద్భుత సాహిత్య కార్యక్రమాలను తన ఊరిలోనే చేసారు. ప్రముఖ సాహితీవేత్తలందరికి నేటికి సమాఖ్య తీపిగుర్తు.

అతనే ‘వనం చంద్రమౌళి’ దేవరకొండలోని కీ।।శే।। రాజమ్మ, సత్యనారాయణల ముద్దుల తనయుడిగా జన్మించిన చంద్రమౌళి.. వనం పేరును కీర్తి పతాక స్థాయిన నిలిపారు. తన అన్నాదమ్ములకు, అక్కాచెల్లెళ్లకే కాదు.. ఊరంతా అతని బంధువులే.. దేశ దేశాల తన విద్యార్థులే.

ఆటల యోధుడు– అక్షర ప్రజ్ఞుడు ‘వెన్నెల వనం’_harshanews.com
బండారు సుజాతశేఖర్​ రచించిన పుస్తకావిష్కరణలో వనం చంద్రమౌళి

70 ఏళ్ల ‘వనం చంద్రమౌళి’ వెన్నెలవనం.. పుట్టినరోజు వేళ సాహితీవేత్తలందరి పక్షాన శుభాకాంక్షలు. అతనిలో సగమైన చంద్రకళ.. అతనికి తగిన అర్ధాంగి. కొడుకు, కోడలు, బిడ్డలు, అల్లుళ్ళు, మనుమళ్ళు, మనువరాళ్ళు.. నిండైన కుటుంబం.
 
వనం చంద్రమౌళికి జిల్లా ఉత్తమ పీఈటీ టీచర్,  ‘పొట్టి శ్రీరాములు స్మారక అవార్డు’ , తెలంగాణ ప్రభుత్వ సాహితి సౌజన్యులు వంటి అనేక అవార్డులతో పాటు  అనేక సత్కరాలు పొందారు.  ఇలా ఎన్నో అవార్డులు పొంది.. వాటికే అందం తెచ్చిన వనం చంద్రమౌళి అన్నయ్య సాహితీ శిఖరం.. తనకివే నా వందనం
 
ఆటల యోధుడు– అక్షర ప్రజ్ఞుడు ‘వెన్నెల వనం’_harshanews.com

డాక్టర్​ బండారు సుజాతశేఖర్​
98664 26640  


Post a Comment

0 Comments