ఎందుకిలా ..

ఎందుకిలా .._harshanews.com
ఎందుకిలా ..మనిషికి పుట్టుక 
చావు సహజం కదా.... 
చావుని వింతలా చుస్తున్నారెందుకిలా.... 

నిన్నటి వరకు 
నీతో తిరిగిన మనిషిని
వెలేస్తున్నారెందుకిలా.... 

ఈ మట్టి నీ సొంతమా.... 
ఈ గాలి నువ్వు పోగేసిన ధనమా...  
ఊపిరి  ఉన్నంత వరకే ఏదైనా.... 
మనుషులైనా..... మసలే చోటైనా 
చెడ్డ కాలం చెంతకొస్తే, 
చేతులు కలపలేని స్థితి 
దాపురిస్తే ..... 

ఒక్కటైన మనసులతో 
ఉమ్మడిగా పోరాడాలి కానీ, 
మనిషితనాన్ని 
మలినం చేసుకుంటామా.... 
ఒక్కసారిగా స్వార్ధాన్ని 
అరువు తెచ్చుకుంటామా... 
అసువులొదలిన దేహాలకు 
అశ్రువుల నివాళి లేకపోయినా పరవాలేదు... 
అపోహల శ్వాసని గుండెల్లో నింపుకుంటూ 
అడుగడుగునా అడ్డునిలుస్తూ 
అవమానిస్తుంది ఎవర్ని....... 

రేపటి మన ఉనికిని.... 
శత్రువు చేతిలో చితికిన జీవాన్ని 
చితికి కూడా సాగనివ్వక 
చిత్రవధ చెయ్యొద్దు... 
చేయూతనివ్వక పోయినా 
చిన్నబుచ్చుకొనివ్వద్దు.. 
జాగ్రత్తగా ఉందాం... 
మనల్ని మనం గౌరవించుకుందాం... 
వీలైతే సాయం చేద్దాం... 
లేకుంటే మౌనంగా ఉందాం...  

................................................................................

P.V.పద్మావతి 
దర్శి, ప్రకాశం జిల్లా.
98489 15117

Post a Comment

0 Comments