‘సాయి దీవెన’ కవితాసంపుటి ఆవిష్కరణ

‘సాయి దీవెన’ కవితాసంపుటి ఆవిష్కరణ_harshanews.com
కవితా సంపుటిని ఆవిష్కరిస్తున్న దృశ్యం

మహబూబ్​నగర్​:  తెలుగు పండితురాలిగా పనిచేస్తున్న యువకవయిత్రి కె.రాధికారాణి రచించిన సాయి దీవెన మొగ్గలు కవితా సంపుటిని సావరీన్ రియల్ ఎస్టేట్స్ అండ్ మల్టీట్రేడ్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బోగ కోదండపాణి ఆవిష్కరించారు. జులై 26 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల పాలమూరు సాహితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవయిత్రి సాయి దీవెన తొలి కవితా సంపుటి అయినప్పటికీ షిరిడీసాయి గురించి చక్కగా మొగ్గలు కవితా ప్రక్రియలో రాయడం విశేషమన్నారు. ఈ కవితాసంపుటి ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, కవి కె.లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, సృజామి, డాక్టర్ ఇ.మణికంఠ, బోల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments