ప్రేమ లోకం

ప్రేమ లోకం_harshanews.com
Image by Bingo Naranjo from Pixabay నేను  ప్రేమమయమైన ప్రేమాన్వితమైన
ప్రేమ లోకానికి వచ్చాను
ప్రేమ సాగరం లో మునిగాను
ప్రేమ లోతెంతో చూశాను 
ప్రేమామృతాన్ని ఆస్వాదించాను
అబ్బ ! ఎంత అందంగా ఉందీ లోకం
ఎంత ఆనందమయమైందీ ప్రేమ నాకం

ఇక్కడ  కులమతాల గోడలు లేవు
పేద ధనిక భేదాలు లేవు
చిన్న పెద్ద తేడాలు లేవు
చీకు చింతలు అసలే లేవు
ఆడంబరాల భేషజాలు లేవు

నీది నాది అన్న తారతమ్యాలు లేవు
ఉన్నదంతా అనంత మయమైన ఆనందాలే
అమృతమయమైన వాక్కులే
ఆకాశమంత ఎత్తున మనసులే

ఆ మనసులను అందుకోవాలన్న తపన నాది
ఆనందించాలని అన్న ఆత్రుత నాది
అవి తప్ప నాకు వేరే దే కనిపించడం లేదు

అందుకే ఈ లోకాన్ని వదిలి నేను రాను
అందులోని ప్రేమను మరచి నేను రాలేను
నన్ను ఎవరూ రమ్మని పిలవకండి
నాకు ఇక్కడే బాగుంది

కానీ ఎలా... 
నేను వెళ్ళాలి ఎందుకంటే
బంధాల చక్రంలో ఇరుక్కున్న బందీని
భవబంధాల చట్రంలో బంధింపబడిన ఖైదీని
కుటుంబ బాధ్యతల వలయంలో చిక్కుకున్న సాలీడును
కుటుంబానికి విలువ ఇచ్చే ఒక గౌరవాన్ని
సంసార రధాన్ని నడిపించే ఒక చక్రాన్ని

సమస్యల సుడిగుండంలో తిరుగుతున్న ప్రాణిని
విధినిర్వహణలో విరామమెరుగని యంత్రాన్ని
నైతిక విలువలు కుటుంబము ఉద్యోగము సమాజము
అనే అనే నాలుగు గోడల మధ్య నిలిచిన సగటు మనిషిని
అందుకే ఈ ప్రేమ లోకాన్ని వదిలి వెళ్లాలి
అది అందించిన ప్రేమ బలంతో ముందుకు సాగాలి.
..................................................................................

ప్రేమ లోకం_harshanews.com

రమాదేవి బుక్కపట్నం 
దిల్ సుఖ్ నగర్
98495 96053

 

Post a Comment

0 Comments