రక్షాబంధనం

రక్షాబంధనం_harshanews.com
రక్షాబంధనం 


అన్నా  చెల్లెళ్ళ వేడుక !
రక్తసంబంధానికి ప్రతీక !!

ప్రేమానుబంధాల గీతిక !
భారతీయ సంస్కృతి సూచిక !!

 ఆప్యాయతల రక్షా బంధనం !
సోదరీమణుల అనురాగాలకి అభివందనం !!

సోదర ప్రేమకు ప్రతిరూపం !
ఈ వేడుక ఓ అపురూపం !!

 ప్రతి ఇంటా రాఖీ పండుగ !
తోబుట్టువులుంటారు కలకాలం అండగ !!

బలోపేతమయ్యే మానవీయ బంధాలు !
సోదరీమణులతో అనుబంధాలు !!

బంధాలనెపుడూ చేయరాదు  పరిహాసం !
ఆడబిడ్డల మోముపై ఉండాలెపుడూ దరహాసం !!

కలిమిలేములకు అతీతం !
సంప్రదాయ విలువలు పునీతం !!

కుటుంబ బంధాలు మరింత పటిష్టం !
మన భారతీయతలో ఇదో విశిష్టం !!

...........................................................................

వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు
                ఎం.ఏ., ఎం.ఫిల్., ( పి.హెచ్ డి )
డాబాల బజార్,ఖమ్మం
98497 40116

Post a Comment

0 Comments