యోగాభ్యాసం.. అందరికి భాగ్యం

యోగాభ్యాసం.. అందరికి భాగ్యం_harshanews.com
యోగాభ్యాసం.. అందరికి భాగ్యం 


పుస్తకం పేరు: యోగసాధన-సనాతనధర్మం
ఋషి పతంజలి అష్టాంగయోగము-పరిశీలన)
రచయిత పేరు:  శ్రీ కృష్ణమూర్తి  (యోగామాష్టరు)

ఈ పుస్తకం యోగ, ఆరోగ్యమే కాక, ఆహార వ్యవహారాలు, గుణాల ప్రభావాన్ని, అహంకారాల ప్రభావాన్ని వివరించింది. చదువుతుంటే అనేకనేక ఆలోచల్ని రేకెత్తిస్తుంది. యోగాసనాలను సచిత్రంగా వివరించారు. " రచయిత ఈ పుస్తకం రాయడానికి ముందు ఇరవై సంవత్సరాల నుండి పతంజలి యోగాలయ కారణమని చెప్పాడు. ఆయనతో యోగసాధన చేసినవారే ఈ సనాతనధర్మం మీద ఒక పుస్తకం రాయమన్నారట. అందరికి ఉపయోగకరంగా ఉంటుందని రాసారు"

యోగాభ్యాసం వలన మనిషి తనమీద, తన మనసు మీద పట్టు సాదించొచ్చు. మానసిక ఆరోగ్యం బావుంటునే మనిషి ఏకాగ్రత సాధిస్తాడు. "భారతీయ సంస్కృతిలో మనిషి జీవనశైలి ధర్మంతో ముడిపడినదని, తన చుట్టూ ఉన్న సమాజమునకు కష్టం కలగకుండా ఉండాలి" యుగములు మారిన మనిషి ప్రవర్తన నియమావళి ఒకే మాదిరిగా ఉంది, దీనిని సనాతనధర్మంగా పేర్కొన్నారు.

యోగాభ్యాసం, ప్రాణాయామం అన్ని వయసుల వారు చేయవచ్చు అని రాశారు.  కలియుగంలో మానవులు మూడు గుణములు కలిగి ఉందురని, అవి సత్వ, రజ, తమోగుణములు. కామ, క్రోధ, మదమాత్సర్యములు అనే గుణములు ప్రబలంగా మనిషిని దిగజారుస్తున్నాయని వాటిని జయించేందుకు యోగసాధన మార్గమని చెప్పారు.  ధ్యాన ప్రక్రియల గురించి, ధ్యాన ముద్రల గూర్చి అందరికి అర్థమయ్యే రీతిలో రాయడం జరిగింది.

మానవుని అంతరంగం శరీరముపై ప్రభావం చూపుతుందని అందుకు శుద్దమైన నీరు, మంచిగాలి, మంచి ఆహారం తీసుకోవాలి.  మానసిక ఒత్తిడికి గురైతేనే అనేకమైన రోగాలు, రుగ్మతలు వస్తాయని చెప్పారు. పిల్లల పెంపకం గూర్చి కూడా రాసారు.

ఈ పుస్తకం అనుభవంతో రాయబడినది. నేటి జీవనగమనంలో మనిషి తప్పనిసరి ఆచరించాలి. ఎందుకంటే "ఆరోగ్యమే మహా భాగ్యం" కాబట్టి ఈ పుస్తకం అందరూ చదవండి.
 
ప్రతులకు:
శ్రీ వెంకటేశ్వర బుక్ డిపో,
ప్లాట్ నెం. 3, 103, 2-4-1085
సాయిలక్ష్మి నికేతన్,
నింబొలి అడ్డ,
హైదరాబాద్-500027.

..............................................
యోగాభ్యాసం.. అందరికి భాగ్యం_harshanews.com

సమీక్షకులు:
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
90104 80557. 

Post a Comment

0 Comments