చిరస్మరణీయుడు 'పోతన'

చిరస్మరణీయుడు 'పోతన'_harshanews.com
చిరస్మరణీయుడు 'పోతన' 

వరంగల్ జిల్లా బమ్మెర గ్రామాన సూర్యుడై వెలసి
తెలుగు పదాల కూర్పుతో సహజ పండితుడైనాడు
తెలుగు వాఙ్మయచరిత్రలో చిరస్మరణీయుడు పోతన

పలికెడిది భాగవతమట' అని వినయాన్ని చాటుతూ
నమ్మిన విలువలను సాక్షాత్కరించిన వివేకవంతుడు
పండితపామరులు మెచ్చిన అద్వితీయడు పోతన.

ఆపాతమధుర శబ్దాలంకారాల శ్రుతి హితంగా
భక్తి పారవశ్యంతో మనోరంజకంగా సాగిన భాగవతం
భక్తులకి నిత్యపారాయణ గ్రంథం పోతన భాగవతం.

నవవిధ భక్తుల విశిష్టతను జీవనదిలా పారిస్తూనే
తేటతెనుగు పద్యాలతో కవితామృతాన్ని పంచాడు
పోతన భాగవతభక్తి పారవశ్యం అనన్యసామాన్యం.

హలంతో అందరినీ మెప్పించి కలంతో అలరిస్తూనే
తెలుగు ప్రజల నాలుకలందు నాట్యమాడిన పద్యం
అమృతంవంటి పద్యాలనందించిన ఘనుడు పోతన
................................................

కొలిపాక శ్రీనివాస్ (M.A,M.Phil)
సింగరాజు పల్లి, మండలం: దామెర, 
జిల్లా: వరంగల్ రూరల్ 
98665 14972 

Post a Comment

0 Comments