UWH ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

  • గత 3 రోజులుగా 1000 కుటుంబాలకు అందజేత

UWH ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ_harshanews.com
సరుకులను అందజేస్తున్న UWH ప్రతినిధులు

హైదరాబాద్​: కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు UWH ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా UWH ప్రతినిధి వై.శేఖర్​ మాట్లాడుతూ..  కరోనా కాలంలో ఎంతో మంది నిరుపేదలకు పనులు లేక వారి కుటుంబాలు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందన్నారు. గత మూడు రోజులుగా వెయ్యి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసినట్లు తెలిపారు.  ILP ప్రతినిధి శ్రీదేవి మాట్లాడుతూ.. పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలను గుర్తించామని, వారందరికి నిత్యావసర వస్తువులతో పాటు సానిటైజర్​ కిట్​లు అందజేశామని చెప్పారు. పంపిణీలో అంబర్​పేట పరిధిలోని 23 మంది అంగన్​వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులను ఇచ్చిన ఎస్​అండ్​పీ క్యాపిటల్​వారికి కృతజ్ఞతలు తెలిపారు.    


Post a Comment

0 Comments