ఎల్ఐసీ బీమా.. జీవితానికి ధీమా

  • ఐదు కోట్లతో ప్రారంభమై 31లక్షల కోట్లకు పైగా మూలధనం
  • 64ఏండ్లలో సాధించిన ప్రగతి

ఎల్ఐసీ బీమా.. జీవితానికి ధీమా_harshanews.com
ఎల్ఐసీ బీమా.. జీవితానికి ధీమా 


''మీ జీవితాలకు మేం భరోసా ఇస్తాం. జీవితాంతం.. జీవితానంతరం కూడా '' అంటూ ప్రజలకు చేరువైన ఎల్ఐసి( లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)64వ వార్షికోత్సవం నేడు.64 సంవత్సరాలుగా  పాలసీదారులకు అండగా నిలిచింది.

1956 లో రూ .5 కోట్ల ప్రారంభ మూలధనంతో ప్రారంభమైన ఎల్ ఐ సి నేడు రూ. 31,96,214.81 కోట్లు, లైఫ్ ఫండ్‌తో రూ. 31,14,496.05 కోట్లు మూలధనంతో దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థగా రూపొందింది. సమాజంలో  ఉత్తమ ప్రయోజనం కోసం నిధులను వినియో గించడం ద్వారా నేషన్ బిల్డింగ్ యాక్టివిటీస్‌లో ఎల్‌ఐసి ముందంజలో ఉంది. సమాజ ప్రయోజనాల కోసం పెట్టిన పెట్టుబడులు మొత్తం 2020 మార్చి 31 నాటికి రూ . 30,69,942 కోట్లు. 

దేశ వ్యాప్తంగా ఎల్‌ఐసికి  నేడు ఎనిమిది జోనల్ కార్యాలయాలు, 113 డివిజనల్ కార్యాలయాలు, 74 కస్టమర్ జోన్లు, 2048 బ్రాంచ్ కార్యాలయాల ద్వారా పాలసీదారులకు సేవలు అందిస్తోంది. 3354 లైఫ్ ప్లస్ కార్యాలయాలు, 31556 ప్రీమియం పాయింట్లు ఏర్పాటు చేసి ప్రిమియం చెల్లంపులో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంది. 

ఎల్ ఐ సిలో లక్ష మందికి పైగా ఉద్యోగులు, 12.08 లక్షల ఏజెంట్లు పనిచేస్తున్నారు. దాదాపు  28.92 కోట్ల  పాలసీలు అమలులో ఉన్నాయి. 28 రకాల ప్లాన్ ల ద్వారా పాలసీదారులకు విశిష్టమైన సేవలు అందిస్తున్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తూ మార్కెట్ లో ఉత్తమ బీమా సంస్థగా నిలబడింది. ఉత్పత్తులను అందించాలి. కస్టమర్లకు  డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్ పోర్టల్ వ్యవస్థ ద్వారా ఆన్లైన్ సేవలను అందిస్తోంది.పేటీఎం, ఫోన్‌పే ,గూగుల్ పే (బిల్‌డెస్క్) ద్వారా ప్రీమియం చెల్లింపు అందుబాటులో తీసుకువచ్చింది.

Post a Comment

0 Comments