మొగ్గలతో సాయీశునికి అక్షరార్చన


మొగ్గలతో సాయీశునికి అక్షరార్చన_harshanews.com
మొగ్గలతో సాయీశునికి అక్షరార్చన 

సాహిత్యం రచనలు చేసే ఒక కళ కాలానుగుణంగా ఆధునిక సాహిత్యం పలురూపాలలో విప్లవాత్మకమైన మార్పులకు లోనై అనేక ప్రక్రియలు గా పాఠకులను ఆకట్టుకున్నాయి. ఆకర్షింపబడి రచనలు చేయాలనే సంకల్పం కలిగిస్తున్నాయి.అలాంటి మొగ్గలు సాహితీ ప్రక్రియనే ఆకుల బాబూరావు రచించిన
"శ్రీసాయి అక్షరాంజలి" మూడు పాదాలతో ఆధునిక సాహిత్యం లోకి ప్రవేశించిన నూతన కవితా ప్రక్రియ మొగ్గలు మినీ కవితలా కనిపిస్తుంది. మొదటి రెండు పాదాలు ఒక అంశాన్ని భావయుక్తంగా చెపితే మూడో పాదం పైరెండు పాదాలకు సమర్తింపు వాక్యంగా కొనసాగుతుంది. సాయి అక్షరాంజలిలోని కొన్ని మొగ్గలను చూద్దాం.

కలలో కనిపించే ఇష్టదైవమతడు 
కోరిన కోరికలు తీర్చే మహాత్ముడతడు
కొంగు బంగారం అయిన సాయి అతడు
అంటూ సాయినాథుని దివ్య కటాక్ష మహిమను మొగ్గలలో ఆవిష్కరించాడు

వేపచెట్టు క్రింద కూర్చున్న మోక్షజ్నుడు
కష్టాలను పారద్రోలే లోకనాథుడు
ఇహపరాల్నితెలిపే సాయినాథుడు
తాను కూర్చున్న వేపచెట్టు నీడనే ఆసనం వేసుకుని అక్కడి నుండే దీనజనుల కష్టాలను కనుగొని ముక్తిని ప్రసాదిస్తాడు

దివ్యదృష్టి నెరిగిన వైరాగ్యి
సర్వంతెలిసిన బైరాగి
వాత్సల్యరూపుడు మనసాయి
సాయీశుని ప్రేమమయ తత్వాన్ని వివరించాడు

జోలపట్టి ఇంటింటికి బిక్షకు వెళ్ళి
వారి పాపకర్మములను మూటకట్టుకుని
వారికి సన్మార్గము చూపే మార్గనిర్దేశే సాయి.

భిక్ష కోసం జోలెపట్టినా తీసుకున్న భిక్ష తోపాటు వారిపాపాలను స్వీకరించి పాప ప్రక్షాళన చేసిసన్మార్గము ను చూపించే మార్గదర్శి సాయినాథుడు అని సాయిచరిత్రను మొగ్గలు గా ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు. విభిన్న అంశాలతో మొగ్గలు ప్రక్రియలో మరెంతో  కృషి చేయాలని కోరుతూ శుభాకాంక్షలు.
...................................................

మొగ్గలతో సాయీశునికి అక్షరార్చన_harshanews.com
వాసరచెట్ల జయంతి
హైదరాబాద్
85568 49733Post a Comment

0 Comments