గురు బ్రహ్మ

గురు బ్రహ్మ_harshanews.com
గురు బ్రహ్మ 


ఆది గురువు గా అమ్మ !
సృష్టించాడు తనని ఆ  పరబ్రహ్మ !!

నేడు ఉపాధ్యాయ దినం  ( సెప్టెంబర్ 5 ) !
శిష్యకోటికి పర్వదినం !!

నేర్పును విలువలతో కూడిన విద్యా బుద్ధులు !
నైతికతతో కూడిన సుద్దులు !!

ఎల్లవేళలా చేయును సందేహాలను నివృత్తి !
అలుపెరగని  బోధనే వారి ప్రవృత్తి !!

సమాజ నిర్మాణంలో గురువు పాత్ర మహోన్నతం !
ఉపాధ్యాయుని స్థానం అత్యున్నతం !! 

నాడు విలువలతో కూడిన విద్యా బోధన !
అందుకే దైవస్వరూపంగా గురు ఆరాధన !!

అధ్యాపకునికుండేది బోధనలో మెళుకువ !
అభ్యసనలో విద్యార్దికుండాలి అణుకువ !!

భావి పౌరులకు చూపించును తోవ !
అజరామరమయినది మీ సేవ !!

విద్యార్థులందరిది భిన్న మనస్తత్వం !
విద్యా భోదనలో గురువులది ప్రత్యేక తత్వం !!

నాటి విద్యావిధానం లోఉన్న నైతికత !
అభ్యసన కొరకు చూపిరి అంతా ఉత్సుకత !!

విద్యార్థుల ఉన్నతే తన ఊపిరిగా భావన !
ఉత్తములుగా తీర్చిదిద్దుటలో ఇస్తారు చల్లని దీవెన !!

అనుక్షణం విద్యార్థుల భవితకు బాసట !
తమ మోములో కనిపించనివ్వని అలసట !!

నల్ల బల్ల వంటిది అజ్ఞాన తిమిరం !
విజ్ఞాన జ్యోతి కోసం సుద్ద ముక్కతో చేయును సమరం !!

ఔన్నత్యంలో గురువుకెవరూ సాటిరారు !
వారిని విస్మరించిన , ఇక సమాజ ఉన్నతి తారుమారు !

కొవ్వొత్తిలా తను కరుగుతూ అందించును అక్షర ప్రకాశం !
గురువు ఎపుడూ ఆశించును శిష్యుల స్వయంప్రకాశం !!


అందుకే...
గురుబ్రహ్మ గురుర్విష్ణు
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ 
తస్మయి శ్రీ గురువే నమః

భువిలోని గురు బ్రహ్మలందరికి గురు పూజోత్సవ శుభాకాంక్షలతో...
................................

గురు బ్రహ్మ_harshanews.com
వోరుగంటి శ్రీ వెంకటేశ్ బాబు
           ఎం.ఏ., ఎం.ఫిల్.,(పి.హెచ్ డి )
డాబాల బజార్, ఖమ్మం
9849740116


Post a Comment

0 Comments