'గానా'మృతం

'గానా'మృతం_harshanews.com
'గానా'మృతం 

వేలాది పాటల కంఠస్వరం మూగబోయెను !
బాలు మరణంతో సంగీత ప్రపంచమే బోసిపోయెను !!
మర్యాద రామన్నతో గాయకుడిగా ఆగమనం !
ప్రతిభతో అష్టదిక్కులకు పాకిన మీ గమనం !!
మీ పాటలు కలిగించెను శ్రావణానందం !
అందరి మనసుకు మహదానందం !!
బహుభాషల్లో వినిపించిరి 'గానా'మృతం !
కాదు కాదు ఇది బాలామృతం !!
ఎవరూ రారు మీకు సాటి !
నేటి గాయకుల్లో మేటి !!
ఎందరో నటులకు గాత్ర దానం !
ఎదిగినకొద్ది ఒదిగి ఉండుట మీ జీవన విధానం !!
గాయకుడిగా అజరామరం మీ కీర్తి !
మీ క్రమశిక్షణే కావాలి భావి గాయకులకు స్ఫూర్తి !!
మహాభినిష్క్రమణతో అందరూ దిగ్భ్రాంతి !
మీ ఆత్మకు చేకూరలి సంపూర్ణ శాంతి !!
..........................................................................

'గానా'మృతం_harshanews.com
వోరుగంటి శ్రీ వెంకటేష్ బాబు
డాబాల బజార్, ఖమ్మం
9849740116


Post a Comment

0 Comments