పాలమూరు కవన వేదిక ఆధ్వర్యంలో జాతీయ కవి సమ్మేళనం

పాలమూరు కవన వేదిక ఆధ్వర్యంలో జాతీయ కవి సమ్మేళనం_harshanews.com
పాలమూరు కవన వేదిక ఆధ్వర్యంలో జాతీయ కవి సమ్మేళనం  ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని "పాలమూరు కవన వేదిక" మహబూబ్ నగర్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి వాట్సాప్ సమూహ కవిసమ్మేళనంలో 210 మంది కవులు పాల్గొన్నారని  పాలమూరు కవన వేదిక అధ్యక్షులు రవి చంచల, సమన్వయకర్త బండారు సునీత ఒక ప్రకటనలో తెలిపారు.  "శ్రీ గురు దేవో భవ" అనే అంశంపై గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ దేశ విదేశాల నుంచి కవులు పాల్గొన్నారని వారి నుంచి 21 మంది కవులకు ఉత్తమ కవితా పురస్కారంను, ప్రశంసా పత్రముతో పాటు బహుమతులు , పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం అందజేశామని తెలిపారు. 

న్యాయనిర్ణేతలుగా 
1) డా.మురహరరావు ఉమాగాంధి, విశాఖపట్నం జిల్లా
2) శ్రీమతి యలగుండ్ల సుచరిత, ఖమ్మం జిల్లా
3) చిత్తలూరి సత్యనారాయణ, హైదరాబాద్
4) డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ. వనపర్తి జిల్లా

శ్రీ గురుదేవోభవ ఉత్తమ కవితా పురస్కారం అందుకున్న కవిమిత్రుల జాబితా
1) మాడుగుల మురళీధర శర్మ, సిద్దిపేట
2) ఎన్. అపర్ణ జ్యోతి, కరీంనగర్
3) కుందారపు గురుమూర్తి, బలిజపల్లి,కడప
4) డాక్టర్ బల్లూరి ఉమాదేవి, డల్లాస్ అమెరికా
5) కిలపర్తి దాలినాయుడు, సాలూరు
6) జోగు కృష్ణయ్య, రంగారెడ్డి
7) ఆర్.వి.ఎస్.ఎస్ శ్రీనివాస్, గునా, మధ్యప్రదేశ్
8) తుమ్మ రాజా, కోదాడ
9) తురుమెళ్ళ రాధాకృష్ణమూర్తి, శాంతినగర్, గద్వాల్
10) జామి సత్యనారాయణ, లక్కవరపుకోట, విజయనగరం
11) ఉరిమళ్ళ సునంద, ఖమ్మం 
12) కొప్పుల ప్రసాద్, నంద్యాల
13) కే.శైలజా శ్రీనివాస్, విజయవాడ
14) తంగళ్ళపల్లి ఆనందాచారి, హన్మకొండ
15) జి.శాంతారెడ్డి, మహబూబ్ నగర్
16) జుంతుల సుచరిత, జగిత్యాల
17) తూపురాణి వేంకటకృష్ణమాచార్యులు, సూర్యాపేట
18) ధనాషి ఉషారాణి,భాకరాపేట, చిత్తూరు
19) తాండ్ర చిరంజీవి, వరంగల్ 
20) లక్ష్మీ సామవేదం, అమెరికా
21) బస్వోజు లక్ష్మణాచారి, నాగర్ కర్నూల్  

శ్రీ గురుదేవోభవ అంశంపై 210 కవితలు పంపిన కవిమిత్రులకు మరియు ఉత్తమ కవితా పురస్కారం అందుకున్న మిత్రులకు ఇరవై రోజుల నుంచి గ్రూపు లోని కవితలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న సమన్వయకర్త బండారు సునీత గారికి, విలువైన సలహాలను సమాచారాన్ని అందజేసిన కళారత్న పొట్లూరి హరికృష్ణ గారికి మరియు న్యాయనిర్ణేతలకు  హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు.

ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు రవి చంచల, బండారు సునీత గార్లను సాహిత్యాభిమానులు, కవులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Post a Comment

0 Comments