ఎడారి దిబ్బోలే..

ఎడారి దిబ్బోలే.._harshanews.com
ఎడారి దిబ్బోలే.. 


అదొక
నిశ్శబ్ద గోళం
మరణ శయ్యను
ముద్దాడిన గోరువంకలు
కరళ నృత్యం జేస్తున్నవి

స్వేచ్ఛ తంత్రులు
నిశీ రాతిరిలో బంధియై
మానవతా లతలు
దిగులు మోముతో
పుడమి కై
ఆశగా జూస్తున్నవి

అమావాస్య చీకట్లలాగా
మహమ్మారి
మాయజూదంలో జేరి
పున్నమా వెన్నెలలో
అగ్ని జ్వాలలు రాలుస్తుంది

జనవాహిని
కలిమిలేముల్లేక
ఎడారి దిబ్బోలే
దుఃఖపుటేరులు
అల్గుదుంకుతున్నవి

పిల్ల తెమ్మరుల
తనువంతా
ఆట పాటలతో
సరాగాల సందడులలో
తుళ్ళిoత గమనంలో
చిరునవ్వుల వర్ష
దండకం గుభాలిస్తున్నవి

ఆకలితో
అలమటించే
అన్నార్తుల గోడు
ఎర్ర మల్లెల వాడి వేడిలు
నేలపై పడి కందిపోయినవి

ఇంకాపై
ప్రకృతి మున్పటిలా
పరవాలు పర్చేదెన్నడో..!

మౌన రోదనలు చెదిరి
శబ్ద విన్యాస గీతికలు
పల్లవించేదెన్నడో..!

శాంతి వనంలో
ఉల్లాస సల్లోపాలు
మనవునా విరిసేదెన్నడో....!

మానవ మనుగడ
ఎడారి దిబ్బోలే
మెర్సుడేనా.....ఓ జగతి.....!!
.................................

ఓర్సు రాజ్ మానస.
ధర్మపురి, జగిత్యాల జిల్లా
9849446027

Post a Comment

0 Comments