గురుపూజ శుభాకాంక్షలు

గురుపూజ శుభాకాంక్షలు_harshanews.com
గురుపూజ శుభాకాంక్షలు 

"గురుర్ బ్రహ్మ-గురుర్విష్ణు    
గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్
పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

బ్రహ్మ సృష్టికి మూలం,శ్రీ మహావిష్ణువు సృష్టి అలంకరణకు మూలం,మహా శివుడు సృష్టి సారధ్యానికి మూలం.ఈ త్రిమూర్తుల అద్భుతమైన సృష్టి "గురువు".

గురువు అంటే ఆదర్శనీయం

గురువు అంటే గౌరవప్రదాతం

గురువు అంటే భక్తి పరిపూరితం

గురువు అంటే విశ్వాస భరితం

గురువు అంటే సదా పూజనీయం

గురువు అంటే ఙ్ఞానానికి నిర్వచనం

గురువు శిష్యులకు జీవితాన్ని అందముగా మలుచుకునే మెళుకువలను శిక్షణ ఇచ్చి తమగురుత్వానికి సదా నమస్కరించుకోవాలి.

గురుపూజ శుభాకాంక్షలు_harshanews.com
గురుపూజ శుభాకాంక్షలు 

విలువైన జీవితాన్ని విఘ్నం కలుగకుండా వినాయక స్తుతితో అభ్యాసం మొదలుకొని... ఆంగికమ్.. భువనం యశ్యా.. అంటూ నటరాజ స్వామిని చిరు మువ్వల సవ్వడితో కొలుస్తూ.. సభాకల్ప తరుర్ భాతే అని శోభాయమానమైన ఆహార్యముతో, నృత్యాభినయనముతో బ్రహ్మాంజలితో ఆహ్వానిస్తూ.. మన జీవితాభ్యాసములో రకరకాల మనుషులను దశావతారాలుగా.. మన మేథా సంపదకి పదును పెట్టే జతులు, స్వరములతో.. తల్లితండ్రుల మాట విలువైనది, ఏక పత్ని వ్రతుడు, మార్గదర్శకుడు శ్రీ రామపట్టాభిషేకముతో..

జీవితంలో ఎదురయ్యే సుఖ-దుఃఖాలను నవరసాలుగా..స్త్రీ మూర్తులు ఆదిశక్తి అని అష్టలక్షీ వైభవం,భామాకలాపముగా మనకు నేర్పించి గురువులు ఆదర్శానికి పాత్రులవుతారు.మన జీవితపు మలుపులను, ఒడిదుడుకులను, సమస్యలను సునాయాసంగా ఎదుర్కొనే ధైర్యం శ్రీ కృష్ణ తరంగాలతో అవగాహన కలిగించే గురువులకు నమోవాక్కాలు

పరులకు సహాయ పడటం మనకు మండూక శబ్దంతో,శ్రీ మహావిష్ణువుని గజేంద్ర మోక్షము తలంప చేసి ఇటు నవ సమాజానికి ఉపయోగపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తపన గురువుది.కానీ...నేడు గురువుల ఆలోచనా శక్తిని గౌరవించక,వారిలోని భాషను కించ పరుస్తున్నట్టు చిన్న సందేహం! గురువు పరులకు సహాయ పడటం మనకు మండూక శబ్దంతో, శ్రీ మహావిష్ణువుని గజేంద్ర మోక్షము తలంప చేసి ఇటు నవ సమాజానికి ఉపయోగపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తపన గురువుది.కానీ...నేడు గురువుల ఆలోచనా శక్తిని గౌరవించక, వారిలోని భాషను కించ పరుస్తున్నట్టు చిన్న సందేహం!గురువు లోని ఙ్ఞానము ధనముతో సమానము కాదు ఆ ఙ్ఞాన సంపదను గౌరవించి శిష్యులను,ప్రశిష్యులను తయారు చేసి జయము జయము...అని జేజేలు పలుకుతూ,ప్రసన్న వదనాలతో గురువులోని ఙ్ఞాన కాంతికి శిరస్సు వంచి నమస్కరిస్తూ..

             గురుభ్యోనమః

................................................

గురుపూజ శుభాకాంక్షలు_harshanews.com

-  నాట్యమయూరి టి.వి.శిరీష
హైదరాబాద్
96184 94909
Post a Comment

0 Comments