నిఖార్సయిన ప్రజాకవి

 
నిఖార్సయిన  ప్రజాకవి _harshanews.com
నిఖార్సయిన  ప్రజాకవి 

తెలంగాణ పోరాటానికి ఆయువుపట్టు అవుతూనే
అస్తిత్వ ఉద్యమానికి శంఖారావాన్ని పూరించినవాడు 
కోటిరత్నాల తెలంగాణను మీటిన ధిక్కారస్వరం కాళోజి

నిత్యం అన్యాయం అక్రమాలపై గళమెత్తుతూనే
దోపిడీవర్గాలపై సమరశంఖాన్ని పూరించినవాడు
నిజాం నిరంకుశపాలనపై మోగిన దండోరా కాళోజి

మన భాషకు మన యాసకు పట్టం కడుతూనే
పలుకుబడుల భాషకు ప్రాణం పోసినవాడు
తెలంగాణ భాషనే నిజమైన భాష అన్న కాళోజి

అధర్మాలపై అలుపెరుగని పోరాటం చేస్తూనే
నీతిని నిజాయితిని ఇంటిపేరుగా చేసుకున్నవాడు
నిఖార్సయిన తెలంగాణ ప్రజాకవి కాళోజి

జీవితమంతా నిత్యపోరాటం సలుపుతూనే
ప్రజాసేవలోనే నిరంతరం మునిగి తేలినవాడు
అసలైన ప్రజాస్వామ్య జీవగొంతుక కాళోజి
...................................................నిఖార్సయిన  ప్రజాకవి _harshanews.com
 - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
90328 44017
Post a Comment

0 Comments