ప్రజాకవి కాళోజి సవ్వడిప్రజాకవి కాళోజి సవ్వడి_harshanews.com
ప్రజాకవి కాళోజి సవ్వడి

ఎవరిది ఈ గొడవ 
అని ప్రశ్నించుకొని
సమాజ గొడవను 
తన గొడవగా చేసుకొని
నా గొడవ గా రాసి
సాహిత్యపు 
ఆయుధాన్ని అందించి
నిత్యము నిద్ర లేకుండా 
నిబ్బరముగా  
నిరాఘాటంగా 
ప్రజా కవిగా సాగిన 
ఆయన సాహిత్యపు సేవలకు
వందనాలతో ఈ కవితాసవ్వడి

ఎవడిదిరా 
ఈ తెలంగాణ అంటూ
బూజు పట్టిన 
తెలంగాణ చరిత్రను 
కలముతో కదిలించి
పోరు చేసిన 
సాహిత్యపు కిరణం
కకవికలుగా 
ఉన్న తెలంగాణలో
సాహిత్యమును 
కంటి పాపలా 
కంఠాభరణంలా ధరించిన
సాహిత్యపు కడలికి 
అభినందనలతో ఈ కవితాసవ్వడి

ఎక్కడుందిరా 
సమానత్వం అని గర్జించి
ఎక్కడ వివక్షచూపినా 
అన్యాయపు 
అణిచివేతలు జరిగిన 
వ్యతిరేకించిన సింహనాథుడు

జటిలముగా ఉన్న 
తెలంగాణను 
జంకు లేకుండా చేసి 
జీవన భాషకు 
ప్రాణం పోసిన సమాజ సమదర్శి
రజాకార్లను ఎదిరించి
నిజాం రాజుకు 
నిద్ర లేకుండా చేసిన 
నిరాడంబరునికి జే జే లతో ఈ కవితాసవ్వడి

ఎందుకీకులమతాలు
మానవత్వపు రక్షణకు 
సమాజపు హీనతకు 
కాలకూటము అని చాటిన
కవి కృపాళుడు కాళోజి
వ్యక్తిత్వస్వేచ్చాయుదాలతో
ప్రజాపోరాటం చేసిన
తిరుగులేని 
తెలంగాణ ఉద్యమకారుడు
ప్రజాకవి
సాహిత్యపు కిరణం 
కాళోజి గారిని స్మరించుకుంటూ 
జోహార్లతో ఈ కవితాసవ్వడి
...........................
ప్రజాకవి కాళోజి సవ్వడి_harshanews.com
డా.తెలుగు తిరుమలేష్
తెరసం జిల్లా అధ్యక్షులు
అమరచింత మండలం
    99089 10398
Post a Comment

0 Comments