మనసు


మనసు_harshanews.com
మనసు 

మనసు మమతల వెల్లువ
తనలో ఎన్నో విషయాలను ఇముడ్చుకుంటది
తనకవసరమైనపుడు నెమరేసుకుంటది
సంతోషాలు దుఃఖాలు
విజయపజయాలు
మంచి చెడులను
గిరిగీసుకుని దాచుకుంటది

ఒంటరితనంగున్నపుడు
ఓదార్పు జ్ఞాపకాలను
ముందుపరుస్తది

అపజయం ఎదురైనపుడు
విజయసూత్రాలు బోధిస్తదో గురువులా
ఎందుకంటే
మనమెంటో దానికే తెలుసుమరి
మనసుచెప్పినట్లు నడకసాగితే 
బతుకంతా వెలుగునిండుకున్నట్లే

తప్పుడు నడకలొద్దు
మనసునదుపులో పెట్టకుంటే
గుర్రమై పరుగుతీస్తది
పరువుతీస్తది
తస్మత్ జాగ్రత్త
.................................................

సి. శేఖర్(సియస్సార్),
తెలుగు భాషోపాద్యాయులు
పాలమూరు,
9010480557.

Post a Comment

0 Comments