ఆకాంక్ష (బాలగేయం)

ఆకాంక్ష (బాలగేయం)_harshanews.com
ఆకాంక్ష (బాలగేయం) 

చక్కని చుక్కను నేనైతే
చిక్కని కాంతిని అందిస్తా
మొక్క రీతిలో ఎదిగేస్తా
మిక్కిలి మోదము పంచేస్తా

రెక్కల పక్షిని నేనైతే
ఎక్కడికైనా విహరిస్తా
చిక్కులు ఇల ఎన్ని వచ్చినా
లెక్కచేయక సాగిపోతా


తెల్లని మల్లెను నేనైతే
ఎల్లలు దాటి గుబాళిస్తా
అల్లరి పనులే మానేస్తా
ఎల్లరి మనసులు మురిపిస్తా

జాతిపిత బాపు  నేనైతే
నీతి నియమాలు పాటిస్తా
జ్యోతి మాదిరి ప్రకాశిస్తా
ఖ్యాతిని జగతికి తెచ్చేస్తా
.......................................

-గద్వాల సోమన్న, 
ఎమ్మిగనూరు

Post a Comment

0 Comments