సహనానికి మించిన సంపద లేదు..

 

సహనానికి మించిన సంపద లేదు.._harshanews.com
సహనానికి మించిన సంపద లేదు.. 


గురువు గా విద్యాబుద్ధులు నేర్పించడంతో తన బాధ్యత తీరిపోయింది అనుకోలేదు. రచయితగా మారి సమాజానికి ఎన్నో మంచి విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రచయితగా తాను  చెప్పే విషయాలు సమాజానికి మార్గదర్శకం గా ఉండాలని అనుకుంటున్నారు. నిబద్ధతగల అంశాలతో ఎన్నో పరిశోధనా వ్యాసాలు సమర్పించిన ఆమె దిక్సూచి శ్రీ లక్ష్మీ కూడా పిలువబడ్డారు. సహనానికి మించిన సంపద లేదంటూ సాహిత్య రంగంలో ఆమె చేస్తున్న కృషి అపారం. విద్యా దానం,  రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


పూర్తి పేరు: శ్రీలక్ష్మి చివుకుల. సాహితీ వేత్త
పుట్టిన తేదీ: అక్టోబర్ 17
తల్లిదండ్రుల పేర్లు: కోట దేవప్రసాద్ & సత్యవతి
భర్త  పేరు : అన్నాజీరావు ( విశ్రాంత ఉపవిద్యాశాఖాధికారి)
పిల్లలు:  కృష్ణ మోహన్ & ఉషారమణి (సాఫ్ట్వేర్ ఇంజనీర్లు)
రాజేంద్ర & చిద్రూపి ( వైద్యవృత్తి)
విద్యార్హతలు:  ఎం.ఏ‌. ఎకనమిక్స్, ఎం.ఏ. హిస్టరీ, ఎం.ఇడి., ఎం.ఫిల్. ఎడ్యుకేషన్, హిందీ ప్రవీణప్రచారక్ 
ఏ రంగంలో పని చేస్తున్నారు : విద్యారంగం, సాహిత్య రంగం
ఉద్యోగ వివరాలు : విశ్రాంత ఉపాధ్యాయురాలు
( విజయనగరం పురపాలక సంఘం కస్పా హైస్కూల్ ఉపాధ్యాయురాలిగా పదవీవిరమణ)
ప్రవృత్తి : రచనా వ్యాసంగం, పరిశోధన

సహనానికి మించిన సంపద లేదు.._harshanews.com
అవార్డును స్వీకరిస్తున్న శ్రీలక్ష్మి

ప్రస్తుతం సాహిత్యపరంగా చేస్తున్న కార్యక్రమాలు 
*గత23 సంవత్సరాలుగా విజయనగరం జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షురాలు
*మూడు సంవత్సరాలుగా జిల్లా రచయితల సంఘం గ్రూపు అడ్మిన్
*జిల్లా రచయిత్రుల సమాఖ్య అధ్యక్షురాలు మరియు  గ్రూప్ అడ్మిన్ మార్చి 2018
*సాహితీ వేత్తలు గ్రూప్ వ్యవస్థాపకురాలు గ్రూప్ అడ్మిన్  అక్టోబర్ 2016
*నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం ఉపాధ్యక్షురాలు మరియు గ్రూప్ అడ్మిన్ మార్చి 2018
* నవసాహితి ఆంధ్ర ప్రదేశ్ వేదిక విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షురాలు గ్రూప్ అడ్మిన్  అక్టోబరు 2019
* తెలుగు కూటమి విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షురాలు డిసెంబరు 2019

హాబీలు : అందరితో కలిసి చేసే కదంబ కార్యక్రమాలు మొక్కల పెంపకం వంటపని పిల్లలకు పద్యాలు నేర్పడం రక్తదానం మొదలైనవి

మీకు ఇష్టమైన, స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు

మంచి ఆశయాలు కలిగిన వ్యక్తులు అందరూ స్ఫూర్తిని కలిగిస్తారు. ముఖ్యంగా మా కోడలు ఉషారమణి తన సొంత కంపెనీలో ఎందరికో ఉపాధి కల్పిస్తూ, తన చుట్టూ ఉన్న బాధితులకు సహాయం చేస్తూ,  గూగుల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, అన్ని ప్రదేశాలకు నిర్భయంగా వెళుతూ, నిరాశలో ఉన్న వారికి ఉత్సాహాన్ని కలిగిస్తూ బ్రతుకు పట్ల ఆశను కల్పిస్తూ నాకు స్పూర్తిని కలిగిస్తూ ఉంటుంది.

మీ రచనలు

కవితలు, కథలు, లేఖలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, రేడియో ప్రసంగాలు, కదంబ కార్యక్రమాలు, అనేక సంకలనాలలో కథలూ, కవితలూ, వ్యాసాలు ప్రచురింపబడినవి. పుస్తకాలు రాయడం స్వంతంగా పబ్లిష్ చేసుకోవడం.

ఇప్పటివరకూ రాసినవి

60 కథలు, 400కవితలు

40 పరిశోధనా పత్రాలు

20 రేడియో కార్యక్రమాలు

10 స్టేజి కార్యక్రమాలు


ఇప్పటివరకు వ్రాసిన పుస్తకాల వివరాలు

1.తవ చరణాలు 
2.శ్రీ రామాయణం ప్రశ్నోత్తరాల మాలిక 1200 ప్రశ్న-జవాబులు
3.విజయనగర వైభవానికి దిక్సూచి 1100 పేజీలు పుస్తకం 
4.ఆది నుండి అనంతం దాకా...
సమగ్ర భారతదేశ చరిత్ర 116 మంది కవులచే వ్రాయబడిన కవితాసంకలనం 500 పేజీలు
వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినది.
5.శ్రీరామ చంద్ర ప్రశస్తి 16 వ్యాసాలసంకలనం 500పేజీలు అయోధ్యలో తులసి సదన్ వారికి ప్రచురణ కొరకు ఇవ్వబడినది.
6.నాదయోగులు.. వ్యాస సంకలనం ( రాస్తున్నాను)

సహనానికి మించిన సంపద లేదు.._harshanews.com
రక్తదానం చేస్తున్న శ్రీలక్ష్మి

ఈ సమాజానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
మారుతున్న కాలానికి అనుగుణంగా నా రచనల ద్వారా మంచిని సమాజంలోకి పంపించాలని కోరుకుంటున్నాను. సానుకూల దృక్పథంతో సమస్యలను ఎదుర్కోవాలని, మానవత్వాన్ని మించినది లేదని చెప్పాలనుకుంటున్నాను.

అవార్డులు 

1. మండల, జిల్లా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వ పురస్కారాలు.
2. N.C.E R.T. New Delhi వారి నేషనల్ సెమినార్ లో జాతీయ అవార్డు
3. అనేక విశ్వవిద్యాలయాల్లో పత్రసమర్పణకు పురస్కారాలు & ప్రశంసా పత్రాలు
*యోగ ఉపయోగములు అంతర్జాతీయ సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
4. అవార్డులు- బిరుదులు
 * బాసరలో  సహస్ర కవిమిత్ర, సహస్ర లేఖామిత్ర, సహస్ర పద్య కంఠీరవ, సహస్ర శ్లోక కంఠీరవ
* ఒంగోలులో కళా మిత్ర 
*  హైదరాబాద్ లో రాష్ట్ర మహిళా ఆణిముత్యం
సర్వేపల్లి రాధాకృష్ణన్ పురస్కారం
* విశాఖపట్నం లో మదర్ థెరీసా పురస్కారం
*గురుబ్రహ్మ పురస్కారం  
* తిరుపతి లో జాషువా పురస్కారం
* శ్రీకాళహస్తి లో జాతీయ పురస్కారం ఇన్నొవేటివ్ అచీవ్మెంట్
* న్యూఢిల్లీ లో జాతీయ పురస్కారం ఇన్నొవేటివ్ అచీవ్మెంట్ 
* విజయనగరం లో మహాత్మా గాంధీ పురస్కారం & కందుకూరి వీరేశలింగం పంతులు గారి పురస్కారం ఇంకా చాలా..... మొదలైనవి ప్రశంసా పత్రాలు ఆధారంగా)

మీ లక్ష్యం 

విశ్వ మానవ శాంతికై అందరికీ ఉపయోగపడే ఒక మంచి పుస్తకము రాయాలని 

మీరు చెప్పేఒక మంచి మాట 

సహనానికి మించిన సంపద లేదు.

Post a Comment

0 Comments