అనుభవం


అనుభవం_harshanews.com
 అనుభవం 
 మనిషికి జీవితమే ఒక అనుభవం 
 అనుభవించే వారే అనుభవజ్ఞులు 

 తీరైన మాటే అనుభవానికి ముచ్చట 
 సమయాలోచన, సమయస్ఫూర్తే అనుభవమంటే 

 అనుభవానికి ఆదర్శం  ధనం 
ధనవంతులకు అనుభవమున్నా అణకువ సున్నా 
విజ్ఞులకు మరి అనుభవమే సంస్కారం 

అన్నీ వున్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది కదా !!
మరి ఏమి లేని విస్తరి ఎగిరెగిరి పడిందిట !!

అనుభవం అనేది కూడా నిండైన విస్తరిగా 
అణిగి మణిగి అనుభవించాలి 

మాట పదిలం, నడక పదిలం అంటుంది అనుభవం. 
అనుభవజ్ఞుల అనుభవాలు ఆదర్శమైతే,
వారి సరసన నిలిచినా అందము,ఆనందము. 

నోటి మాట కంటే కలానికి పదునెక్కువ ఉన్నట్లు.. 
అనుభవాలయ్యకు పరువు, పదును ఎక్కువే  గదా !!

మాటే మంత్రముగా, మనసే బంధముగా కొలిచిన నాడే 
అనుభవానికి భవనాన్ని కట్టినంతఁ ఆనందము. 

మనిషకి కష్ట సుఖాలు ఆభరణాల అనుభవాలు 
ఆ  ఆభరణాలను సమయస్ఫూర్తి తో అలంకరించిన 
మన జీవితం ఆనందమయమే మరి. 

మాటల మృదుత్వం మనసుకి అనుభవమైతే 
మనుసుకి కలిగే అనుభవమే  జీవితం 
అదే మన అనుభవాల ఒడిదుడుకుల ప్రయాణం

నేటి అనుభవమే రేపటి అణకువ 
రేపటి ఆలోచనే జీవితపు ఆనందాల నౌక. 

నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు... 
ప్రవర్తన మంచిదైతే మరి ప్రపంచమే మంచి కాదా? 
ఏమంటారు మరి? 

...................................................................................................

- టి. వి. శిరీష
హైదరాబాద్
96184 94909


Post a Comment

0 Comments