![]() |
అంతర్జాలంలో పాల్గొన్న వాగ్గేయకారిణులు |
బతుకమ్మ, దసరా పండుగలు మహిళా శక్తి నిరూపణకు సాక్ష్యాలు.. ఈ పరంపరలో ప్రపంచంలోని పేరొందిన వాగ్గేయ కారిణులు అయిన 24 మంది నారీమణులతో తానా సాహిత్య వేదిక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నారీ -సాహిత్య భేరీ" కార్యక్రమం అంత ర్జాలంలో విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 24 మంది వాగ్గేయకారిణులు కార్యక్రమంలో పాల్గొని అద్భుతమైన పాటలు వినిపించారు.
ఈ సందర్భంగా తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ మాట్లాడుతూ మహిళా సాహితీవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో "నారీ- సాహిత్య భేరి" శీర్షికను ప్రారంభించామన్నారు. నారి లేకపోతే నరలోకమే లేదని, వనిత లేకపోతే జనత లేదని, కాంత లేకపోతే.. కలియుగమే లేదన్నారు. విశ్వ విజయ భేరి- వీర నారి. అటువంటి నారీ శక్తిని గౌరవించడం, అభిమానించడం మన అందరి కర్తవ్యమని ఆయన పిలుపునిచ్చారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ " మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపటానికి మహిళా సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుందని, మహిళా సాహితీవేత్తలను ప్రోత్సహించటం ద్వారా నవ సమాజానికి నాంది పలుకుతుందని, రానున్న కాలంలో మరిన్ని ఇటువంటి కార్య క్రమాలు అందిస్తామని" ఆయన తెలిపారు.
సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ "నారీ సాహిత్య భేరి" శీర్షిక ప్రారంభించడం తెలుగు సాహితీ చరిత్రలోనే ఒక మైలురాయి గా నిలుస్తుందని, ఇది ఒక శుభ పరిణామం" అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా జరిగిన వాగ్గేయకారుల వాగ్గేయ కారినుల గాన లహరి కార్యక్రమంలో " మహిళలు మేల్కొనాలి అని, హక్కుల కోసం పోరాడాలని.. అమ్మను మించిన దైవం లేదని, సృష్టికి మూలం స్త్రీ అని, ప్రతి పురుషుడు విజయం వెనక స్త్రీ ఉంటుంది అని, స్త్రీ శక్తిని మించిన శక్తి మరొకటి సృష్టిలో లేదని, స్త్రీ సాధించలేని విజయం అంటూ ఏమీ లేదని, స్త్రీ నడుం బిగించి ముందుకు సాగాలని, పిరికితనంతో వెనుకడుగు వేయరాదని, మృగాలకు పై తిరగబడాలి అని, ఎదురు తిరగాలని," అనేక సందేశాలు ఇస్తూ పాటలు పాడారు.
ఆత్మీయ అతిథులుగా పాల్గొని పాటలు పాడిన వాగ్గేయ కారిణులు
మంగిపూడి రాధిక (సింగపూర్), డాక్టర్ బండారు సుజాత శేఖర్ ( హైదరాబాద్), కవుటూరి గాయత్రి (ఖమ్మం), యామినీ కనకతార (హైదరాబాద్), డాక్టర్ సుధా (నోయిడా), బుర్ర పద్మశ్రీ (హైదరాబాద్), నిభానుపూడి శ్రీ వాణి (హైదరాబాద్), తిరుపతి గారి అంబుజ (మహబూబ్ నగర్), డాక్టర్ పండ్రంగి శారద (ఒరిస్సా), అడ్డగూరి శ్రీ లక్ష్మీ (మంచిర్యాల), ఎడవల్లి శ్రీదేవి (తాడేపల్లిగూడెం), వజ్రాలు ఇందిర (తిరువూరు), వాణి ప్రభాకరి (తణుకు), బాన్న రాజేశ్వరి ( వైజాగ్), సీతాలత (అనకాపల్లి), కందూరు సుజాత రాణి (హైదరాబాద్), లక్ష్మీ పెండ్యాల (హైదరాబాద్), వై.కే. సంధ్య శర్మ (చిత్తూరు), అడ్డగూడి ఉమాదేవి (వరంగల్), పి. వీ. సాయి అనూఙ్ఞ ( వైజాగ్), ఇంజ పురి వసంత (కరీంనగర్), బి అంజనీ దేవి (గుంటూరు), డాక్టర్ భల్లూరి ఉమాదేవి (డల్లాస్) అమెరికా, సుందరవల్లి తిరుమల ( న్యూజెర్సీ), అమెరికా.
ఈ కార్యక్రమంలో తానా ఇంటర్నేషనల్ ఉమెన్స్ కో ఆర్డినేటర్ లక్ష్మీదేవిని ప్రత్యేక అతిధి గా పాల్గొని ప్రసంగించారు. సుమంత్ రామ్ శెట్టి సాంకేతిక సహకారం అందించారు. తానా ఉమెన్స్ కోఆర్డినేటర్ శిరీష తూను గుంట్ల వందన సమర్పణ చేశారు.
0 Comments