వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి ప్రత్యేకం

 
వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి ప్రత్యేకం_harshanews.com
వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి ప్రత్యేకం 

 ముంగిలి ఏదైనా
 ఎత్తిన జెండా చిరునామా
 కాలం ఏదైనా న్యాయం తన ఎజెండా
 నిత్యం చెలరేగే సంఘర్షణ 
 నిప్పు రేణువులను రాజింప జేస్తే
 జ్వాలైన, అగ్ని శికమైనా,మొదటి అడుగు తాను
 ప్రజాజీవనం గొంతుక ఐన తానే తానే
 ఓ దీప్తి శిక, ఓ ఎర్ర బావుటా......
 పిడికిలి బిగించిన చేతులు
 జైళ్ల గోడల్ని, ఇనుప చువ్వల్ని
 కలాలను చేసిన వైనం.....
 నాటి నేపథ్యం అదే
 రాక్షస మూకలు, దుశ్చర్యలు గడీల
 పాలకుల పీడన లు... అవే అవే
  సిరా కత్తులు,రక్తాక్షరాల సృష్టించిన వేళ...
 ఉద్యమాల ఖిల్లా, నల్గొండ జిల్లా
 నకిరేకల్ లో విరిసిన అగ్గి పూవు...
 పన్నెండు ఆళ్వారులు, తనతో
 పదమూడుగా కీర్తించ బడ్డ
 నాటి నేటి తరం జే హారతి లందుకున్న తేజం
 తొలి తెలంగాణ జీవన చిత్రీకరణ
 ప్రజలమనిషి నవలగా... గంగులు
 ఎన్నో ఎన్నెన్నో రూప చిత్రాల శిల్పి
 పాత్రికేయ,గ్రంధాలయం
 తొలి తెలంగాణ ,ఉద్యమరూపము తానే
 నిలిచి గెలిచిన చిరంజీవి 
 అక్షరాల నీ అక్షర మందారాలు నేటికీ ఎర్ర పూలే.
వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి ప్రత్యేకం_harshanews.com

డాక్టర్ బండారు సుజాత శేఖర్
98664 26640
 


Post a Comment

0 Comments