నా గుండె సవ్వడి

 

నా గుండె సవ్వడి _harshanews.com
నా గుండె సవ్వడి 

నా గుండె సవ్వడి 
ఆగిపోయినట్టుంది 
ఆమె పిలుపు సవ్వడి 
వినపడకపోతే...... 

కాలంతో నా మనస్సు 
నడవనంటుంది 
ఆమెతో జతగా 
నడవకపోతే

ఎన్ని యుగాలైనా నా 
తనువు పురుడుపోసుకోనంటుంది 
ఆమె మరల 
జన్మించకపోతే

ఆమె ఎటువైపు వెళ్తే ఆ వైపు 
పొద్దు తిరుగుడు పువ్వు లా 
నా మనసు తిరుగుతానంటుంది 
ఆమె నా వైపుగా చూడకపోతే

ఈ కవి హృదయం కవనాలను 
రాయనంటుంది 
ఆమె నా కన్నుల ముందరా 
లేకపోతే..
..............................................................................

ఆర్. మాధవి 
కలం పేరు. వెన్నెల 
91828 18057





Post a Comment

0 Comments