వేగుచుక్క

వేగుచుక్క_harhanews.com
వేగుచుక్క 

చెలి!
నువ్వు నడిచే దారిలో
ఆమని.. ఆనవాళ్లు వెతుకున్నా..
నీ నిష్క్రమణం 
ఆకాశం లో అకస్మాత్తుగా
అదృశ్యమైన జాబిల్లిలా..
తోచింది.

నీ లేమి తో
సంతోషాన్ని బహిష్కరించింది
నా మనస్సు...
ఆనందం ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది...

నిద్రించిన నా జ్ఞాపకాలకు..
వేకువజామున వేగుచుక్కలా 
వెలుగుపూలు.. విరజిమ్ముతావా...
కాంతిపుంజానివై కంటిపాప ను చేరి ..కనురెప్పలలో..
దాగివున్న కలలు... కనుగొనలేవా నేస్తం...

నీ మువ్వల అలికిడి లో
నాలో కలిగే అలజడి లో
గుండె సడితో..
నిద్దుర పై   తిరుగుబాటు చేస్తున్న...
నా కన్నుల  దాగిన కలలు..
కన్నీళ్లు కనలేవా..?
మౌనం వెనుక దాగిఉన్న
మనసు  కనిపించలేదా

జాబిలి ని వీడని తారకలా..
నింగిని వీడని జాబిలి లా 
రేపటికి వికసించే
రెల్లుపూవు లా...
ఎదురుచూస్తూనే ఉంటా నేస్తం
ఈ జన్మంతా ..నీకోసం.
...................................................................
వేగుచుక్క_harhanews.com

మాధవి శ్రీనివాస్ నందిమళ్ల
హైదరాబాద్ 


Post a Comment

0 Comments