రికార్డుల రారాజు ప్రముఖ రెప్లికా ఆర్టిస్ట్ ‘డా.దార్ల నాగేశ్వరరావు’

 

  • ఇప్పటివరకు 587 అవార్డులు
  • తన ఖాతాలో “ఆక్సిజన్ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్” మరో అవార్డు


రికార్డుల రారాజు ప్రముఖ రెప్లికా ఆర్టిస్ట్ ‘డా.దార్ల నాగేశ్వరరావు’_harshanews.com
దార్లకు అవార్డు అందజేస్తున్న శ్రీనివాసరావు

పట్టుదలకు తోడు పని మీద అంకిత భావం ఉంటే.. ఎన్ని అవార్డులైన కైవసం చేసుకోవచ్చనడానికి ప్రముఖ రెప్లికా ఆర్టిస్ట్ ‘డా.దార్ల నాగేశ్వరరావు’  నిదర్శనం..  రెప్లికా ఆర్ట్​ విధానంలో ఎన్నో అవార్డులు ఆయన సొంతం.. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు తనలోని ప్రతిభను సానబెడుతూ ముందుకుసాగారు.. తన ముందు అవార్డులు కూడా చిన్నబోయాయి.. వెరసి అవార్డులు వందల సంఖ్యలో తన ప్రతిభకు పట్టం కట్టాయి..  

తెలంగాణ ప్రభుత్వ ముద్రణాలయంలో చీఫ్ డిజైనర్ గా పని చేసి రిటైర్మెంట్ అయిన  డా॥దార్ల నాగేశ్వరరావుకు మరో అవార్డు వరించింది.   డా.దార్లకు  “ఆక్సిజన్ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్”  అవార్డును మెగా రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు పి.శ్రీనివాసరావు అందజేశారు. 

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన కళాకారులకు “ఆక్సిజన్ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్” అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో అనేక రికార్డులను అందుకున్నవారితోపాటు కొత్తగా అనేక ప్రక్రియలతో వెలుగులోకి వస్తున్నవారికి ప్రాణవాయువుగా ఆక్సిజన్  అందించాలనే ఉద్ధేశ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. దీనిలో భాగంగానే డా. దార్లకు అవార్డును అందజేసినట్లు తెలిపారు.  సరూర్​నగర్​లో తన స్వగృహంలో  దార్ల నాగేశ్వరరావు దంపతులను శాలువతోను సత్కరించి, జ్ఞాపికను అందజేశామన్నారు.  భవిష్యత్ లో విభిన్న ప్రక్రియలతో విభిన్న రంగాలలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారెవరైనా oxygerecords@gmail.com ద్వారా లేదా 6304758260ను  సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.

అవార్డు గ్రహీత డా. దార్ల నాగేశ్వరారావు మాట్లాడుతూ..  ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో వుంటూ ఇప్పటికే 570 రికార్డులను అందుకున్నానని చెప్పారు. తాజాగా అందుకున్న ఆక్సిజన్ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డులు పదిహేడు సర్టిఫికేట్లను కలుపుకొని మొత్తం ఈరోజుకి 587 రికార్డులని తెలిపారు.  ఫిబ్రవరి,2020లో మూడు రికార్డులను తీసుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు ఈ రికార్డులను అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అవార్డును అందజేసిన శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ఆక్సిజన్ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. 

రికార్డుల రారాజు ప్రముఖ రెప్లికా ఆర్టిస్ట్ ‘డా.దార్ల నాగేశ్వరరావు’_harshanews.com
దార్లను సన్మానించిన శ్రీనివాసరావు


డా.దార్ల రికార్డులు..

•45 దినపత్రికలను రెప్లికా ఆర్ట్ పద్ధతిలో చేతితో కాపీ చేసినందుకు..
•ది హిందూ దినపత్రికను 1/4 సైజ్ కు చిన్నదిగా చేసి చేతితో కాపీ చేసినందుకు..
•14 పేజీల ఈనాడు మెయిన్ దినపత్రికను ఒకే రోల్ పేపర్ లో చేతితో కాపీ చేసినందుకు..
•తనింటి పేరు “DARLA” పేరుతో ఓ దినపత్రికను రూపొందించి, మళ్ళీ రెప్లికా పద్ధతిలో కాపీ చేసినందుకు..
•33,265 రంగుల స్టిక్కర్స్ (బొట్టుబిళ్ళ) లతో 44 వ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ముఖచిత్రమును రూపొందించినందుకు..
•10,075 రంగుల స్టిక్కర్స్ (బొట్టుబిళ్ళ)లతో బిగ్ సైజ్ విజిటింగ్ కార్డును తయారు చేసినందుకు..
•13,200 కేవలం నలుపు రంగు స్టిక్కర్స్ (బొట్టుబిళ్ళ) లతో మూడు రూపాలలో చార్లీ చాప్లిన్ ను రూపొందించి నందుకు..
•”ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి” అను సాయి నామ స్మరణను లీగల్ పేపర్ సైజులో ఒక వెయ్యి రెండు వందల ముప్పై నాలుగు (1,234) రెప్లికా పోస్టర్లను సంవత్సరంపాటు రూపొందించినందుకు..
•36,628 సార్లు “INDIA” ఇంగ్లీషు అక్షరాలను రెడ్, గ్రీన్, బ్లాక్, రంగుల జెల్ పెన్నులతోను, మరియు నీటిరంగులతో ఇండియా మ్యాప్ ను రెప్లకా పద్ధతిలో చేతితో రాసినందుకు..
•సంవత్సరంపాటు 120 సంవత్సరాల “నయా క్యాలెండర్” ను రెప్లికా ఆర్ట్ పద్ధతిలో రూపొందించినందుకు..
•సంవత్సరంపాటు 6,00,600 (ఆరు లక్షల, ఆరు వందలు) గుండు సూదలను ఉపయోగించి, థర్మాకోల్ బోర్డుపై గుచ్చి, జాతాయ జెండా రంగులతో, వాటి ప్రాముఖ్యత తెలిపే “యూనిటీ ఆఫ్ నేషన్” కళాఖండాన్ని చేసినందుకు..
•పెళ్ళై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25 రోజులపాటు 25 రకాల కార్యక్రమాలు చేసినందుకు.. 
•బాంబే ఐఐటి కాలేజీలో మూడ్ ఇండిగో ఆధ్వర్యంలో జరిగిన ఫెస్టివల్ సందర్భంగా, మూడ్ ఇండిగో వారి మూడు రకాల కళాఖండాలు “మియాం మియాం బొమ్మను”, “లోగోను”, “లెటర్ హాడ్ ను” స్టిక్కర్స్ (బొట్టుబిళ్ళ) లతో రూపొందించినందుకు..
•తెలుగు భాషకు మూలమైన (బేసిక్) అక్షరాలను రెప్లికా పద్ధతిలో చేతితో రాసినందుకు..
•6.5*4.5 సెం.మీ. సైజ్ లో అయిదు సార్లుగా, మొత్తం 3,060 చిన్నపాటి జాతీయ జెండాలను రూపొందించినందులకు..
•రెప్లికా ఆర్ట్ పద్ధతిలో, హోలీ బైబిల్ నుండి మొదటి పది, జెనెసిస్ ఎనభై, ఎక్సోడస్ అరవై ఎనిమిది మొత్తం 158  పేజీలను రాసి నందులకు..
•”స్వయం-సందర్శనం” పేరుతో, తెలుగు రాష్ట్రాలలో గల 123 ప్రతిభావంతులను, కళాకారులను కలిసి, ఫేస్ బుక్ లో వారి గురించి కథనాలను పోస్ట్ చేసినందుకు
ఇలా వివిధ రకాల ప్రక్రియలు చేసినందుకుగాను పలు అవార్డులు వరించాయి..

Post a Comment

0 Comments