అనుభవ లహరి


అనుభవ లహరి_harshanews.com
అనుభవ లహరి 

తోలేటి సుచరితా దేవి గారు, శ్రీ దక్షిణా మూర్తి గార్ల అనుభవాలను పుస్తక రూపంలో అనుభవ లహరిలో చాలా చక్కగా వివరించారు. తోలేటి దక్షిణా మూర్తి, పశ్చిమ గోదావరి వాస్తవ్యులు అలాగే ధర్మపత్ని తోలేటి సుచరితా దేవి, గుంటూరు వాస్తవ్యురాలు. వీరిరువురు వివాహ అనంతరం బొంబాయి లో స్థిర పడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. బాబు తోలేటి  రవీంద్ర (ఆర్మీ ఆఫీసర్), పాప డాక్టర్. పద్మజ (వైద్య నిపుణురాలు)

జీవితంలో నమ్మలేని అనుభవాలను ఎదుర్కొని అతి సులభమైన సాధనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవటం చదువరులకు తప్పక ఆకట్టుకుంటుంది. వారి అనుభవాలను "సాక్షాత్కారముతో "పరిచయం చెయ్యటం క్రొత్తగా వుంది.

ధైర్యం, సాహసం వున్నా ముందుగా భగవంతుడికి ప్రసాదంతో  ప్రారంభిస్తాము అందరికి తెలిసిందే..వారిరువురూ ఉద్యోగ రీత్యా ఉన్నత స్థాయి పదవులలో ఉన్నప్పటికీ, సమయాన్ని సద్వినియోగ మార్గములో ఆలోచించేవారు, ఎంతో ముదావహం. భగవంతుడు మనకు ప్రసాదించిన జన్మను ముక్తి మార్గములో నడిపిస్తే మంచి మంత్రముగా పని చేస్తుందంటారు తోలేటి సుచరితాదేవి గారు.

అనుభవ లహరి_harshanews.com
అనుభవ లహరి 

అనుభవ లహరి లో కొన్ని సందర్భాలు కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. వివరములోకి వెళ్తే జరిగినవి నిజాలే సుమా!!మనకు ఇష్టమైన పనికి మన ఇష్ట దైవాన్ని తలచిన తప్పక తీర్చును అనే వ్యాసం ఆసక్తికరముగా వుంది.దైవలీలలు మనము ఊహించలేము, అనుభవిస్తాము అని నిరూపించిన సంఘటనలు చదివిన కళ్ళు చెమర్చాయ్యి.

సుచరితా దేవి హైదరాబాదులో ఆధ్యాత్మిక విద్య బోదిస్తున్నారు. వారి గురుదేవులు వి.యస్. ఆర్.మూర్తి గారి శిష్యరికంలో బాలవికాస్ నడుపుతున్నారు.


ప్రతులకు:
తోలేటి సుచరితాదేవి
38/4 ఆర్.టి.,
అరుణ ఫొటో స్టూడియో పక్క వీధి,
బర్కత్​పుర, హైదరాబాద్​.
98661 08552

..........................................................................

అనుభవ లహరి_harshanews.com

విశ్లేషణ 
–టి.వి. శిరీష 
హైదరాబాద్​
96184 94909 

Post a Comment

0 Comments