![]() |
Image by Free-Photos from Pixabay |
గీమే వచ్చుడు పిలగాండ్ల దోస్తాని వాయే
కరోనమ్మ రాకుంట పాటలు బంద్ వెట్టే
ఎక్వ -తక్వ మాట్లాడొద్దని మాటలు బంద్ వెట్టే
సర్దయితే పరేషానాయే అమ్మా , నాయినా
జెరమొస్తే బుగుల్ వట్టే దవాఖాన్ జూషి
పిల్లలు రాసుడు యాద్ మరుస్తున్నరంట
ఇగ శక్లం ముక్లం కూసునుడు కూడా వాయే!!
బుడ్డ పిల్లలకు ఆన్లైన్ జెప్పుడే మరి.. రేపు
టీచరమ్మ కానోస్తే గుర్తువడతరో, లేదో.. మరి
మార్నింగ్, ఆఫ్టేర్నూన్, ఈవెనింగ్ గుర్తు రాక పాయె
కెమెరా ఆఫ్, వీడియో ఆఫ్,మ్యూట్ నేర్వ వట్టే
ఇస్కూల్ టైం, బ్యాగు మరిసి షానా దినాలాయే
మల్ల గుర్తు జెద్దామంటే ఆ రోజులు రాకపాయే
రాఖీ పున్నం, బత్కమ్మ, దొంతుల పండగ వాయే
అలయ్ -మలయ్ వాయే కరోనమ్మ పాడుగాను!!
పక్కపొంటోళ్లు పల్కరియక పాయె
ముందరింటోళ్ళ మాటలే లేక పాయె
అందరిండ్లల్ల దర్వాజలు మూస్క పాయె
పైలం అడగనీకే వోతే రావొద్దనే
దోస్తులతోని ఆటలు, మాటలు వాయే
యాద్ కోస్తున్నయ్ గిల్లి డాన్డూల్, కబ్బాడి
కలిసి మెలిసి తిరుగుడు వాయే
ఆలోచన చేస్తే మనసు ఫికరాయే
కరోనమ్మ తల్లి నీ కాల్మొక్కుత తల్లి....
పిల్లలు- పెద్దలు ఆగమాగామైతున్నరు తల్లి..
ఇగ బండి గట్టి పోరాదే,మమ్లను ఇడిసివెట్టు తల్లి..
జర దునియను జూషీ,దావత్ జేసుకుంటం.
..............................................
- టి. వి. శిరీష, కవియిత్రి హైదరాబాద్ 96184 94909 |
0 Comments