![]() |
బతుకు-భ్రాంతి |
జీవితం -కోరికలు-కలలు
ఉత్సాహం-నిరుత్సాహం
ఎదురు దెబ్బలు
ఎక్కిరింతలు
అన్ని యధాతధమే
ఉత్సాహం-నిరుత్సాహం
ఎదురు దెబ్బలు
ఎక్కిరింతలు
అన్ని యధాతధమే
ఈ జగత్తులో మన భ్రాంతి అనిర్వచనీయం
ఉన్నది లేనట్టుగా
లేనిది ఉన్నట్టుగా
మనకు కావల్సినవి మాత్రమే
మనకి దక్కినట్లు ఊహలు
కొన్ని సార్లు ఆలోచన అంతా కలిసి
అనుక్షణం వేదించే భ్రాంతి
చెడు జరుగుతుందని,తెలియని ఆందోళనతో భ్రాంతి
నన్ను నేను మరచి నా ఊహలకు ప్రాణం పోసి
ఆకాశాన మైమరచి ఊగిసలాడుతుంటే
అప్పుడే అమ్మ పిలుపు
నిద్రలే ఇక అని
లేచి చూస్తే నా కలల భ్రాంతి
అంతా భ్రాంతే
బ్రతుకు అంతా
జరిగేవి
జరిగేవి ఊహించుకునే దానికి పొంతన లేనంత
లెక్కించ లేనంత
లెక్కకు రానంత భ్రాంతి
అంతా భ్రాంతియే
..................................................
శ్రీలత సవిడిబోయిన (శ్రీ)
సీతానగరం, పర్ణశాల
81073 59735
0 Comments