నెచ్చెలికి స్వాగతం

నెచ్చెలికి స్వాగతం _harshanews.com
నెచ్చెలికి స్వాగతం 

            

చేతికి గాజుల్లా, కళ్ళకు కాటుకలా 
నుదుటున తిలకంలా చక్కనమ్మకు స్వాగతం!!

నూతనముగా అడుగిడుతున్న తరుణికి స్వాగతం
ప్రకృతిని నయనానందముగా తీర్చిదిద్దే సుదతికి స్వాగతం!!

నిండు మనసుతో మమతలను మరచిపోవద్దని
నిండుతనమే నీకు శ్రీరామరక్షా అనే ముదితకి స్వాగతం!!

గతాన్ని స్మరించకు,వర్తమానాన్ని ఆనందించు,
భవిష్యత్తుని ఆశాజనకముగ స్వాగతించు!!

బుడి బుడి అడుగులతో చిరు చిరు నవ్వులతో
ముద్దు ముద్దుగా మాట్లాడే నూతనమ్మకు స్వాగతం!!

శార్వరమ్మ బంధాలను, స్నేహలను కట్టడి పెట్టినా
నాయకత్వంతో వస్తున్న నారిమణికి స్వాగతం!!

గంధర్వుడిని కోల్పోయాము,నృత్య చూడామణిని కోల్పోయాము, ఎందరినో శార్వరమ్మ దూరం చేసింది
మంచు కురిసే వేళలో వస్తారనే ఆశలమ్మకు స్వాగతం!!

అనురాగాలు,ఆత్మీయతలు,అనుబంధాలు శాశ్వతమని 
అపకారాలు,అపరాధాలు,అనుమానాలు మరి అహం కారం అని నేర్పింది చిన్నమ్మ...
చిన్నమ్మ మాట విలువైనదని,నిరూపిస్తానని వస్తున్న నెరజాణకు స్వాగతం!!

మృదువైన మాట,సరళమైన భాష,గంభీరమైన నడక,
కలిసి మెలిసి మనతో మనసుపడ్డ వనితకు స్వాగతం!!

నాడు, నేడు అని సందేహించక ముందడుగు వెయ్యమని 
నీ ఆనందమే నాకు ఆభరణాలు అనే అభయముర్తికి
స్వాగతం!!

ధనమే అన్నిటికి మూలం అనుకున్న అదృష్ట దేవత
కాదు మానవ బలమే అదృష్టం అని వచ్చేస్తున్న మనోహరికి స్వాగతం!!

సుగంధ పరిమళాలతో,సువాసన వెదజల్లుతూ, నెమలికి నేర్పిన నడకలతో వయ్యారాలతో విహరించటానికి వచ్చిన నాట్య మయూరికి స్వాగతం!!

2021 నూతన సంవత్సరం శుభాకాంక్షలు.

నెచ్చెలికి స్వాగతం _harshanews.com

-టి.వి. శిరీష, కవియిత్రి

హైదరాబాద్.
+91 96184 94909
Post a Comment

0 Comments