Hot Widget


 

Type Here to Get Search Results !

 


"కష్టం - ఇష్టం"

kastam..istam_harshanews.com
కష్టం–ఇష్టం



కష్టే ఫలి అన్నారు పెద్దలు

 కష్టం విలువ తెలిసిన వారు ఎవ్వరిని కష్ట పెట్టరు, ఇష్టం విలువ తెలిసిన వారు ఎవ్వరిని వదిలి పెట్టరు.
 కష్టం అనేది  విశాలమైన అనుభవాల వృక్షం ఇష్టంతో సాధించిన దాని ఫలం మరి రుచి అనుభవమే.

కొత్త-కొత్త పరిచయాలు బాగుంటాయి కానీ  పాత బంధాలే బలంగా ఉంటాయి. 
కష్టాలంటే కన్నీళ్లు కావు, రాబోయే ఆనంద భాష్పాలు   
కొత్త పరిచయాలకు మారిపోకూడదు
అపురూమైన అనుబంధాలను వదులుకోకూడదు

మనం లేని దానిని గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం
ఉన్నదాన్ని గురించి ఇష్టంగా ఆలోచిస్తే మిగిలేది సుఖం

కష్టానికి ఇష్టానికి ఎంతో అవినాభావ సంబంధమట 
కష్టానికి తెలుసు ఇష్టంగా వచ్చే బంధం బలపడును అని

మన మెదడే మనకు శత్రువట తెలుసా?
మరచే విషయం మరువనీయదు సరికదా...
గుర్తు చేసుకునే విషయం గుర్తు రానియవు..

కష్టాలను సహించినవారు జీవిత రధ సారధులు
ఇష్టంగా రధాన్ని అలంకరించుకుని ఆనందిస్తారు 
కష్టం విలువ తెలుసుకోలేనివాడు సంపాదించలేడు
కష్టపడి విలువ తెలుసుకున్నోడు సంపాదించిన స్నేహం,
ప్రేమ, ధనం అయినా మరి వృధా చెయ్యడు.

జీవితంలో కష్టాలు రావచ్చు,రాకపోవచ్చు
వచ్చిన కష్టాన్ని ఇష్టంగా మలచుకుని సాగనంపాలి
జీవిత నౌక లో మనది ఒడిదుడుకుల ప్రయాణం
సముద్ర కెరటాలను సమయస్ఫూర్తి గా ఎదుర్కోవాలి
అలల సోయగాల సవ్వడికి  ముచ్చట పడద్దు 
జీవితమ్ అలల ఘోష గా మార్చుకోవద్దు

 కష్ట కాలంలో ఎవ్వరూ ఆదరించి పలుకరు సరికదా
 క్షణ క్షణం కష్టాన్ని కలవరింప చేస్తారు మరి
  ఇష్టంగా కష్టాన్ని అధిగమించిన నమ్మరు సరికదా
 క్షణం క్షణం కీర్తించుటకు వస్తారు మరి

 ఇష్టంతో కష్టాలను జయించుటే జీవిత పాఠం
 అది తెలుసుకున్న నాడే మన జీవితానికి మలుపు  


........................................................................

టి. వి. శిరీష
(కవియిత్రి )
 96184 94909


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies