Hot Widget


 

Type Here to Get Search Results !

 


ఏది శాశ్వతం

 

yedi shaswatham_harshanews.com
ఏది శాశ్వతం



ఏది శాశ్వతం అని 
నాది నాదని అంటున్నావ్ 
ఓ మనిషి.....


క్షణాల్లో ఏం జరుగుతుందో 
తెల్వదు.... 
మరుక్షణం వుంటమో వుండమో తెల్వదు....


లేని దాని పై ఆశ పడుతూ.. 
చేతిలో వున్న క్షణాలని వదిలేస్తూ... 
లేని భవిష్యత్తు ను నిర్మిస్తూ.. 
నిరంతరం భ్రమలో 
బ్రతుకు బండినిసాగిస్త‌ూ.. 
వర్తమానాన్ని విస్మరిస్తూ...


డబ్బు మాయలో పడిపోయి 
మానవత్వ విలువలు 
మర్చిపోయి... 
ఆపాయత అనేది కరువై పోయిన నేటి సమాజాన్ని 
చూసి ఏం అని రాయను 
ఎంత అని వివరించను...


పుట్టుట, గిట్టుట కొరకే నని 
మధ్యలో జరిగింది మాయేనని 
తెలియదా ఈ మానవాళి కి 
తెలిసుకోరా మనషులంతా ఒకటేనని 


వేదకాలంలో మొదలైన ఈ కులవ్యవస్థ
ఎప్పుడు మంటలో కలిసిపోతుందో 
మనషులందరు ఒకటేనన్న భావన
ఎప్పుడు పుడుతుందో.

..................................................

ఆర్. మాధవి 
కలం పేరు. వెన్నెల 
91828 18057

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies