మరో 10 రోజులు లాక్​డౌన్​

CM KCR మరో 10 రోజులు లాక్​డౌన్​_harshanews.com
  మరో 10 రోజులు లాక్​డౌన్​ 


హైదరాబాద్​: కరోనా కట్టడి నేపథ్యంలో లాక్​డౌన్ ను మరో 10 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావు అధ్యక్షతన సుదీర్ఘంగా మంత్రులతో కేబినెట్​ సమావేశాన్ని నిర్ణయించారు.  అయితే ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలకు  కేబినెట్​ఆమోదం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మినహాయింపులిచ్చింది. మరోగంట పాటు (సాయంత్రం 6 గంటలు) ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది.  సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి ఉదయం 6 గంటల వరకూ లాక్​డౌన్​ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కరోనా పాజిటీవ్​ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గంలో 2గంటల వరకూ లాక్​డౌన్​ను నిర్ణయించారు. సత్తుపల్లి, నల్గొండ, మధిర, మునుగోడు, నాగార్జునసాగర్​, మిర్యాలగూడ, దేవరకొండ  నియోజకవర్గాల్లో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.  ఈ నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు, మరో గంట (2గంటల వరకు) లాక్​డౌన్​ ఉంటుందని కేబినెట్​ స్పష్టం చేసింది. 

Post a Comment

0 Comments