ప్రతిభను ఎవ్వరూ అణిచిపెట్టలేరు


  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
  • కోట్ల శతక కావ్యం ఆవిష్కరణ

హైదరాబాద్​:  ప్రతిభతో పాటు పట్టుదల ఉంటే ఎవ్వరూ అణిచివేయలేరని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి స్పష్టం చేశారు. అక్షరయాన్ ఉమెన్ రైటర్ ఫోరమ్ ఆధ్వర్యం లో  ఐఎఎస్ అధికారి , సెల్ఫి ఆఫ్ సక్సెస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రచయితగా ఖ్యాతి గడించిన  బుర్రా వెంకటేశం ప్రేరణతో, కాళోజి అవార్డు గ్రహీత  కోట్ల వెంకటేశ్వర రెడ్డి ‘ కోట్ల ’ శతకము ఆవిష్కరణ పలువురు ప్రముఖులు, సాహితీవేత్తల సమక్షంలో హాకా భవన్ లో నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ..  మాతృభాష పట్ల బుర్రా వెంకటేశంకు ఉన్న మక్కువ ఎక్కువని, వారి ప్రతిభ ద్వారా ఇంకా రాష్ట్రానికి చాలా సేవలు అందించాలన్నారు. సాహిత్యం యొక్క అంతిమ లక్ష్యం సామాజిక ప్రయోజనం ,తాను కూడా జిల్లాలలో భాషా పండితుల ద్వారా విద్యార్థులకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. గంభీరమైన విషయాలను సరళంగా చెప్పగలగడం వల్ల ప్రజాబాహుల్యానికి చేరుతుంది. అలాంటి సరళ శతకాన్ని ప్రాచూర్యం లోకి తెచ్చిన బుర్ర వెంకటేశం, కోట్ల వెంకటేశ్వర రెడ్డిలను మంత్రి అభినందించారు.

సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ  తెలుగు సాహితీ ఐక్య వేదిక అని అక్షర్​యాన్ ని అభినందించారు. సరళ శతకము యొక్క ప్రయోజనం అనన్య సామాన్యం తెలిపారు. కృతి స్వీకర్త సరళ శతకము ప్రాచూర్యం లోనికి రావడానికి ముందడుగు వేసిన బుర్ర వెంకటేశం భాషకు బందీగా భావం ఉండకూడదు, భావన భాషతో సమాంతరంగా వెళ్ళాలన్నారు. ఒక లక్షమంది విద్యార్థుల ద్వారా సరళ శతకము వ్రాయిస్తానన్నారు.  ఐనంపుడి శ్రీలక్ష్మి  టీమ్ వర్క్ ను ప్రశంసించారు. డాక్టర్ ఎస్ రఘు పుస్తక సమీక్ష చేశారు.

Post a Comment

0 Comments